Bhatti Vikramarka at Kamareddy District Hospital

కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో భట్టి విక్రమార్క

Date:29/08/2020

కామారెడ్డి ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బృందం పర్యటించింది.  రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ బృందం చేపట్టిన ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శన యాత్ర లో దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా నాలుగోవ రోజు కామారెడ్డి జిల్లా ఆస్పత్రిని  భట్టి విక్రమార్క, షబ్భిర్ అలీతో కలిసి సందర్శించారు. ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది, సదుపాయాల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.  1994 లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి ఆసుపత్రిని 100 పడకల ఆస్పత్రిగా మార్చిందని అయన  చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రం గా ఏర్పాటు చెందిన తరువాత జిల్లా ఆసుపత్రికి ఉండాల్సిన 350 పడకల ఆసుపత్రిగా మార్చాల్సి ఉన్నా.. ఈ ముఖ్యమంత్రి హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి మండిపడ్డారు. కనీసం 100 పడకల ఆసుపత్రికి ఉండాల్సిన సిబ్బందిని కూడా ఈ అరేళ్లలో తెలంగాణ సర్కార్ నియమాకలు చేయకపోవడం, కనీసం ల్యాబ్ పరికరాలు లేకపోవడం దుర్మార్గమని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు ముందుండి నడిచారని, అలాంటి ప్రజలను ఈ ముఖ్యమంత్రి మోసం చేశారని అన్నారు. ప్రజలు ఆపదలో ఉంటే ఆయన మాత్రం ఫామ్ హౌజ్ లో పడుకొని, ఆయన కుటుంబం పెద్ద పెద్ద భవనాల్లో జాగ్రత్తగా ఉటున్నారు కానీ పేదలు కరోనాతో మరణిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిచ్చారు.

 

ఎమ్మార్పీఎస్ నిరసన ర్యాలీ

 

Tags:Bhatti Vikramarka at Kamareddy District Hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *