గులాబీ గూటికి భట్టి విక్రమార్క

హైదాబాద్  ముచ్చట్లు :
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం టీకాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. పలువురు సీనియర్ నేతలు ఈ వ్యవహారం పట్ల సీరియస్‌గా ఉన్నారు. మరికొందరు అసంతృప్తితో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీని విడుతారన్న ప్రచారం జోరందుకుంది. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో తిట్టిపోసిన భట్టి.. ఒక్కసారిగా స్వరం మార్చారు. అది కూడా టీపీసీసీ ప్రకటన తర్వాత మరింత తగ్గించారు. అంతకు ముందు ప్రగతిభవన్‌కు వెళ్లి అభాసుపాలైన కాంగ్రెస్ఎమ్మెల్యేలు అపవాదులో చిక్కుకున్నట్లైంది.కేసీఆర్ ఆల్ పార్టీ మీటింగ్‌కు భట్టి ఒక్కడే వెళ్లడం మరింత ఆజ్యం పోసింది.ఇటీవలే దళిత మహిళ మరియమ్మ లాకప్డెత్ అంశంపై నిరసనలకు దిగిన భట్టి విక్రమార్కకు ప్రగతిభవన్‌ నుంచి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనతో పాటుగా ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి సీఎంను కలిశారు. ఏడేండ్ల తర్వాత తొలిసారి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ మెట్లు ఎక్కారు. దీంతో భట్టి తీరుపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కనీసం రాష్ట్ర నాయకత్వానికి కూడా సమాచారం లేకుండా ఎలా వెళ్తారని కాంగ్రెస్పార్టీ ఎస్సీసెల్ చైర్మన్ ఎదుటే భట్టిని ప్రశ్నించారు. దీంతో ఆయన కొంత అలకబూనినట్లు తెలిసింది.ఇదే సమయంలో ఏఐసీసీ టీపీసీసీ చీఫ్ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశించిన భట్టికి టీపీసీసీలో ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. దీంతో భట్టి మరింత ఆవేదనను గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ ప్రకటనతో భట్టి పార్టీపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. త్వరలోనే భట్టి పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Bhatti Vikramarka to Gulabi Gooty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *