భట్టివి తప్పుడు ఆరోపణలు

Date:05/06/2020

పెద్దపల్లి  ముచ్చట్లు:

పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం రామయ్య పల్లె గ్రామంలో మృతుడు శీలం రంగయ్య కుటుంబాన్ని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పరామర్శించారు. మృతుడి  కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. శీలం రంగయ్య తన చున్నీ తోనే ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు అంటుంటే భట్టి ఆ చున్ని ఎక్కడిది అని నిందించడం విడ్డూరంన్నారు. శీలం రంగయ్య కేసు హైకోర్టులో ఉందని దానికి ప్రత్యేక అధికారిగా అంజనీ కుమార్ ని హైకోర్టు నియమించిందని విచారణలో అధికారులు ఎలాంటి తప్పు చేసిన దానికి బాధ్యులైన వారిని తెలంగాణ ప్రభుత్వం క్షమించదుని.కోర్టులో ఉన్న శీలం రంగయ్య కేసును ముఖ్యమంత్రి, డిజిపి స్పందించాలని మాట్లాడడం వెటకారం గా ఉందని.

 

 

శీలం రంగయ్య కుమారుడు వారి తండ్రి మృతి పై ఎలాంటి అనుమానాలు లేవు అన్నాడుని. బడుగు బలహీన వర్గాల శవాలను వినియోగించుకుని రాజకీయాలు చేయకండిని విమర్శించారు.టిఆర్ఎస్ ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నాన్ని,కాంగ్రెస్ ప్రయత్నాన్ని ఖండిస్తున్నారు అనంతరం జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ శవాలపై రాజకీయం చేస్తున్న శ్రీధర్ బాబుకు  భట్టి విక్రమార్క అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉన్నాడని,ప్రతిపక్ష నాయకుడు ఒక సీఎల్పీ నేత చనిపోయిన వారి  కుటుంబని పరామర్శించడానికి వస్తే వారు మాట్లాడలేదని మరి ఎందుకు వచ్చినట్లుని సమాధానం చెప్పాలిని డిమాండ్ చేశారు.

 

స్వాతంత్రం వచ్చి  73 ఏళ్లు అవుతున్నా కుటుంబ పాలన కొనసాగుతోంది.ఖానాపూర్ ఘటన లో మంథని మధుకర్ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేకుంన్న శ్రీధర్ బాబు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారనిన్నారు.మంథని మధుకర్ హత్య కేసు హైకోర్ట్ లో ఉండగా తీర్పు ఎలా వస్తుంది కోర్టులో ఉన్న దాన్ని కేసు వేసి ఎందుకు తీసుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆనాడు మంథని మధుకర్, ఈనాడు శీలం రంగయ్యల  చావులను రాజకీయంగా వాడుకుంటున్నాడని, శవాల మీద పేలాలు ఏరుకునే శ్రీధర్ బాబు ఆగడాలను ఎండగట్టాలని దళిత, సామాజిక వర్గాలకు పిలుపునిచ్చారు.

 నిన్న విజయవాడ,,, ఇవాళ అదిలాబాద్

Tags:Bhattivi’s false allegations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *