భావన టౌన్షిప్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి…..
కలెక్టర్ కు విన్నవించిన అఖిలపక్ష నేతలు
కడప ముచ్చట్లు:
కడప నగరం చింతకొమ్మదిన్నె మండలం పరిధిలోని మూల వంక వద్ద బుద్ధ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ స్వాధీనం చేసుకొని నిర్మిస్తున్న భావన టౌన్షిప్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అఖిలపక్ష నేతలు సోమవారం రోజు గ్రీవెన్స్ సెల్ స్పందనలో డిఆర్ఓ కు
వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జకరయ్య, సిపిఐ నాయకురాలు భాగ్యలక్ష్మి, విలేకరులతో మాట్లాడుతూ, బుద్ధ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్లు అక్రమంగా అనేక రకాల రికార్డ్స్ ట్యాంపరింగ్ కు పాల్పడి, అధికారులను మోసం చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు.

వాటిలో భావన టౌన్షిప్ పేరుతోటి వెంచర్ వేసి సెంటు 13 లక్షలకు మధ్యతరగతి వాళ్లకు అమ్ముతున్నారని ఇది మోసం అని వారు తెలియజేశారు.
692 సర్వే నెంబర్లు కోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా లేఅవుట్ అనుమతికి అప్లై చేయడం ఆశ్చర్యకరమన్నారు. అధికారులు గుడ్డిగా అనుమతులు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నారని రియల్ ఎస్టేట్ మాఫియా కట్టడికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
త్వరలో కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున రిలే దీక్షలు చేయనున్నట్టు తెలియజేశారు.
Tags: Bhavana township lands should be taken over by the government.
