Natyam ad

భవానిపురం ఎగ్జిబిషన్ లో ఘోరం

-కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

-లేబర్ కాలనీ జైపూర్ పింక్ ప్యాలెస్ ఎగ్జిబిషన్ సోమవారం రాత్రి ఘటన

-ప్రాణం పోతున్నా చలించని ఎగ్జిబిషన్ నిర్వాహకులు

Post Midle

-గోప్యంగా ఉంచిన భవానిపురం పోలీసులు

 

విజయవాడ ముచ్చట్లు:

విద్యాధరపురం ఆర్టీసీ బస్ డిపో పక్కన లేబర్ కాలనీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జైపూర్ పింక్ ప్యాలెస్ ఎగ్జిబిషన్ లో ఘోరం జరిగిపోయింది. ఎగ్జిబిషన్ లో సేదతీరేందుకు వచ్చిన ఓ వ్యక్తి కరెంట్ షాకుతో దుర్మరణం పాలయ్యాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ లో నలుగురు యువకులు ప్రవేశించగా, బయటికొచ్చే క్రమంలో వారిలో ఒక వ్యక్తి కాలికి కరెంటు వైరు తగలడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఫౌంటెన్ వద్దకు సందర్శకులు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన నిర్వాహకులు.. నిండు ప్రాణాన్ని పొట్టనపెట్టుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన ఎగ్జిబిషన్ నిర్వాహకులు.. ప్రాణం పోయే వరకు చూస్తూ ఉండిపోయారని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడు రాణిగారితోటకు చెందిన 23 ఏళ్ల వ్యక్తి అని ప్రాథమిక సమాచారం.ఈ విషయం బయటకు పోక్కకుండా పోలీసులు కొంత జాగ్రత్త పడ్డట్టు సమాచారం.

 

Tags: Bhavanipuram exhibition disaster

Post Midle