Natyam ad

పుంగనూరులో భీమా సమావేశం నవ్వులపాలు

– కౌన్సిలర్లు, కన్వీనర్లు డుమ్మా
-చైర్మన్‌ అగ్రహం

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

గ్రామ,పట్టణ సచివాలయాల కన్వీనర్లకు రూ.10లక్షల భీమా కల్పించే సమావేశం బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ అలీమ్‌బాషా, నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి పట్టణం నుంచి కౌన్సిలర్లు , కన్వీనర్లు డుమ్మా కొట్టడంతో తొలి సమావేశం నవ్వులపాలైంది. పట్టణం నుంచి సమావేశానికి 34 మంది కౌన్సిలర్లు హాజరుకావాల్సి ఉంది. అలాగే మండలానికి చెందిన 12 మంది ఎంపీటీసీలు, 23 మంది సర్పంచ్‌లు హాజరుకావాల్సి ఉంది. సచివాలయల కన్వీనర్లు వెహోత్తం 37 మంది హాజరుకావాలి. ఇలా ఉండగా మున్సిపాలిటి నుంచి వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, కిజర్‌ఖాన్‌, కొండవీటి నటరాజ, జెపి.యాదవ్‌, నరసింహులు, కాలిదాసు, భారతి, రేష్మా, సాజిదా, రాఘవేంద్ర లు హాజరైయ్యారు. అలాగే ఆవుల అమరేంద్ర, లక్ష్మణ్‌రాజు, కిషోర్‌ లు వారి భార్యల తరపున హాజరైయ్యారు. 34 మందికిగాను 12 మంది మాత్రమే హాజరైయ్యారు. అలాగే కన్వీనర్లు కూడ అందరు రాకపోవడం మండలం నుంచి మాత్రమే 80 శాతం మంది హాజరైయ్యారు. ఏ సమావేశం నిర్వహించినా పట్టణంలో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుండటంతో నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాలను రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలియజేస్తామని హెచ్చరికలు చేశారు.

పెద్దాయన వస్తే అందరు ప్రజెంట్‌…

పెద్దాయన పుంగనూరు పర్యటన కు వస్తే మాత్రం కౌన్సిలర్లు, నాయకులు, అందరు హాజరై ఫోటోలకు ఫోజులిస్తారు. సామాన్య ప్రజలను కూడ ప్రక్కకు నెట్టి పెద్దాయన కళ్లల్లో పడేందుకు తహతహలాడుతారు. పెద్దాయన తిరిగి వెళ్లిపోగానే వీరి తీరు మారిపోతుంది. సభలకు, సమావేశాలకు డుమ్మా కొట్టడం, తమకేమి పట్టనట్లు వెళ్లిపోవడం , రమ్మని ఎవరైనా అడిగితే మీరు చేస్తే చాలు అంటు ఎద్దెవ చేయడం అలవాటైంది.

అన్నింటికి డుమ్మా…

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వర్థంతి గత ఏడాది జరిగింది. పట్టణంలో ఎంపీ రెడ్డెప్ప, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి తూతూ మంత్రంగా హాజరైయ్యారు. అలాగే మార్చి 12న జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మొక్కుబడిగా నిర్వహించారు. రాజన్న పుట్టిన రోజు జూలై 8న పట్టణంలో పోరుకు చేశారు. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు నామమాత్రంగా నిర్వహించారు.

 

Tags: Bhima meeting in Punganur is laughable

Post Midle