నర్సీపట్నంలో భీష్మ ఏకాదశి ఏకాదశి పూజలు

Date:23/02/2021

విశాఖపట్నం  ముచ్చట్లు:

విశాఖ జిల్లా నర్సీపట్నం షిర్డీసాయి ఆలయంలో భీష్మ ఏకాదశి పురస్కరిచుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఐదు గంటలకు కాగడ హారతి మేల్కొలుపు కార్యం కార్యక్రమంతో  మొదలైన పూజా కార్యక్రమాలు, ఉదయం 6 గంటలకు నిత్యపూజ నిత్య హోమం,  8:30 గంటలకు 108 రకముల పువ్వులతో పూజ  కార్యక్రమం నిర్వహించారు.  మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక హారతి కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.  భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని షిరిడి సాయి దర్శనం కోసం ఉదయం నుండి భక్తులు బారులు తీరారు.  ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.సాయంత్రం 6 గంటలకు 19వ లక్ష దీపారాధన నిర్వహిస్తున్నామని ఆలయం తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కర్రి రాంగోపాల్, కార్యదర్శి డాక్టర్ రామచంద్రరాజు, కోశాధికారి లంక ఈశ్వరరావు, సహాయ కార్యదర్సి పి.వి.రమణరావు,  కమిటీ సభ్యులు పోతుల సత్తిబాబు, మాపాతిన  శంకర్రావు, నంబూరి సత్తిబాబు, మోటూరి లోవరాజు, లంక మణి, వేగేశిన అచ్యుతాంబ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Bhishma Ekadashi Ekadashi Pujas at Narsipatnam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *