Natyam ad

తిరుమలలో భోగి వేడుకలు

తిరుమల ముచ్చట్లు:
 
భోగి వేలుగుల మద్య సప్తగిరులు దేదివ్యమానంగా కాంతులీడాయి.పుణ్యక్షేత్రాల్లో వైభవంగా జరిగిన వేడుకల్లో బాగంగా తిరుమల శ్రీవారి సన్నిది స్వర్ణవర్ణంతో భక్తులను తన్మయపరిచాయి.నిత్యం జరిగే స్వామి వారి కైకర్యాలతో పాటుగా ఈ ఏడాది జరిగిన భోగి వేడుకలు ఘనంగా జరిగాయి.తిరుమల శ్రీవారి ఆలయంలో ముందు ఘనంగా భోగి సంబరాలు వైభంగా జరిగాయి. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ దేవస్థానం వారు రంగవళ్లులతో తీర్చిదిద్దారు. తెల్లవారుఝామున మహాద్వారం ముందు భోగిమంటలు వేసి అత్యంత ఆనందంగా సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. భోగి పాటలతో టీటీడీ సిబ్బంది, భక్తులు సందడి చేశారు. గోవింద నామ స్మరణ చేస్తూ భోగి మంట చుట్టు నృత్యాలు చేశారు. అనాదిగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా అత్యంత భక్తి శ్రద్ధలతో భోగిమంటలు వేసి సంబరాలు నిర్వహించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
TAgs: Bhogi celebrations in Thirumala