గ్రామ సచివాలయ భవన నిర్మాణాలకు భూమి పూజ

Date:13/12/2019

పుంగనూరు, ముచ్చట్లు:

మండలంలోన 18 గ్రామ సచివాలయ భవనాలు మంజూరు అయ్యాయని ఎంపీడీవో లక్ష్మీపతి నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 12:00 నుండి భూమి పూజ కు శంకుస్థాపన చేయుటకు మాజీ జడ్పీ చైర్పర్సన్ పెద్దిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటరెడ్డి , మాజీ ఎంపీపీ నర్సింలు, రాష్ట్ర కార్యదర్శి అక్కిసాని భాస్కర్ రెడ్డిలతో పాటుఇతర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. కావున పంచాయతీ కార్యదర్శులు మీ గ్రామ పంచాయతీలోని సచివాలయ భవనం నిర్మాణం చేయుచున్న వారికి మాజీ ఎంపీటీసీ సభ్యులకు సర్పంచులకు ఇతర ముఖ్యమైన నాయకులకు తెలపాలని కోరారు.

ప్రారంభ షెడ్యూలు

సింగిరి గుంట 12 గంటలకు,
నెక్కుంది 12:30,
బండ్లపల్లి 1 గంటలకు,
ఏతూరు 1.15,
గుడిసెబండ 1.30,
మంగళం 2 గంటలకు,
మోదుగులపల్లి 2:30గంటలకు,
ఎంసిపల్లి 2:45కు,
సుగాలిమిట్ట 3:15 కు,
బోడెవారి పల్లి 3:45 కు,
చండ్రమాకులపల్లి, 04:17కు భూమి పూజ చేస్తారని తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

 

నీటి కొరత షురూ అయింది

 

Tags:Bhoomi Pooja for Village Secretariat Buildings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *