శాస్త్రోక్తంగా భానుకోట శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు భూమి పూజ

– టిటిడి ఆధ్వర్యంలో రూ.3.54 కోట్లతో అభివృద్ధి పనులు

– ఏడాదిలో పనులు పూర్తి చేస్తామన్న ఈవో

 

తిరుపతి ముచ్చట్లు:

 

వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం అహోబిలాపురం గ్రామంలోని భానుకోట శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి   వెలం పల్లి శ్రీనివాస్, టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం భూమి పూజ శాస్త్రోక్తంగా జరిగింది.గణపతి పూజతో ఈ కార్యక్రమాలు ప్రారంభించి వాస్తుహోమం, నవగ్రహ ఆరాధన, నవరత్న స్థాపన, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు అర్చన, నైవేద్యం, హారతి సమర్పించారు.ఈ ఆలయంలో రూ.3.54 కోట్ల వ్యయంతో టిటిడి అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో త్రితల రాజగోపుర నిర్మాణం, శివాలయం, అమ్మవారి ఆలయం, ముఖమండపం పునర్నిర్మాణం, ధ్వజస్తంభం, బలిపీఠం ఏర్పాటు, వినాయక స్వామివారి ఆలయ నిర్మాణం, ఆలయ ప్రాకారం నిర్మాణం తదితర పనులు ఉన్నాయి.ఒక్క సెంటు భూమి అన్యాక్రాంతం కానివ్వం : దేవాదాయశాఖ మంత్రిరాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందిన ఒక్క సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వమని దేవాదాయ శాఖ మంత్రి   వెలం పల్లి శ్రీనివాస్ చెప్పారు. సోమేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శంకుస్థాపన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆలయాలకు చెందిన భూముల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. మరమ్మత్తులకు గురైన ఆలయాల జీర్ణోద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపి  ఆవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బిటెక్ రవి, జిల్లా కలెక్టర్  హరి కిరణ్, జాయింట్ కలెక్టర్    గౌతమి, రావుల కొలను సర్పంచ్   మహేశ్వర రెడ్డి,టీటీడీ చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, ఎస్ ఈ   జగదీశ్వర రెడ్డి, డిప్యూటి ఈవో   రమణ ప్రసాద్, పడ ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

 

రామాలయానికి శంఖుస్థాపన

చవ్వా వారి పల్లిలో రూ.23.5 లక్షలతో రామాలయం నిర్మాణానికి టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, కలెక్టర్ శ్రీ హరి కిరణ్ శంఖుస్థాపన చేశారు.అనంతరం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.భానుకోట శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు ఏడాదిలో పూర్తి చేసేలా ప్రణాళిక తయారు చేశామని చెప్పారు. భానుకోట సోమేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైందన్నారు. ఇక్కడి ప్రజలు, ఎంపి విజ్ఞప్తి మేరకు శ్రీవాణి నిధులతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపడుతున్నామన్నారు. ఈ పనులన్నీ రాతి కట్టడంతో చేస్తామని ఆయన తెలిపారు. చవ్వా వారి పల్లి ప్రజలు, సర్పంచ్ కోరిక మేరకు అ గ్రామంలో కూడా రూ 23. 50 లక్షలతో రామాలయం నిర్మించనున్నామని ఆయన వివరించారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Bhoomi Puja for the restoration work of Bhanukota Sri Someshwara Swamivari Temple scientifically

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *