పుంగనూరులో సీతారామరాజు విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ
పుంగనూరు ముచ్చట్లు:
అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు క్షత్రియ సంఘ నాయకులు శుక్రవారం భూమిపూజ చేశారు. పట్టణంలోని చిత్తూరు బైపాస్ సర్కిల్ వద్ద విగ్రహా ఏర్పాటుకు మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుమతి ఇచ్చారు. ఈమేరకు క్షత్రియ సంఘ నాయకులు భక్తవత్సలరాజు, దామోదర్‌రాజు, వెంకట్రమణరాజు ఆధ్వర్యంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. భక్తవత్సలరాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని అత్యంత సుందరంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన సేవలకు గుర్తుగా ఈకార్యక్రమం చేపట్టామన్నారు. స్థలాన్ని కేటాయించిన మంత్రి పెద్దిరెడ్డి కుటుంభానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిసెబండ కన్వీనర్ హేమాద్రి, కుమార నత్తం వైఎస్సార్ సిపి నాయకులు ప్రసాద్, గ్రామస్తులు మునివెంకట్రామణ, భాస్కర్,ప్రశాంత్ రెడ్డి, గంగప్ప, శ్రీ మంజునాథ్, విజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం, మధు, నరేష్, హేమంత్,ప్రభాకర్,శ్రీనివాసులు రాజు,ఎక్స్ కౌన్సిలర్ లక్ష్మణ్ రాజు,చంద్ర శేఖర్ రాజు,ఈశ్వర్ రాజు,మణి రాజు,కార్యదర్శి లక్ష్మణ రాజు,శ్రీధర్ రాజు,రిపోర్టర్ సతీష్ రాజు,పట్టాభి రామ రాజు, కోశాధికారి సుబ్రహ్మణ్యం రాజు,సతీష్ రాజు, రామచంద్రా రాజు, మురళి, మల్లికార్జున రాజు,త్యాగరాజు,భార్గవ్, వేణు, బాలగుర్రాప్పల్లె నవీన్ రాజు, మంజు,శివ,నాగ, రెడ్డిశ్వర్,శ్రవణ్, హర్షవర్ధన్, రామచంద్రా రాజు,మురళి రాజు,భాస్కర్ రాజు, జ్యోతి రాజు,శ్రీనివాస రాజు,శేషమ రాజు,నారాయణ రాజు,విశ్వాస్, అమర్నాథ్,ప్రభు,మల్లి కార్జున తదితరులు పాల్గొన్నారు.

Tags: Bhoomipuja for installation of Sitaramaraj statue in Punganur
