నారావారిపల్లెలో భువనేశ్వరి
తిరుపతి ముచ్చట్లు:
టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రారంభమ యింది.తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె నివాళులు అర్పించారు. అనంతరం చంద్రగిరికి చేరుకున్నారు. ప్రవీణ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించారు. టీడీపీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.టీడీపీ సోషల్ మీడియాలో ప్రవీణ్ రెడ్డి యాక్టివ్ గా ఉండేవారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను తట్టుకోలేక ఈ నెల 18న ఆయన మృతి చెందారు. భువనేశ్వరి తొలి విడత యాత్ర మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మృతి చెందిన టీడీపీ నేతల కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత మహిళలతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొంటారు. ఈరోజు చంద్రగిరిలో, రేపు తిరుపతిలో, ఎల్లుండి శ్రీకాళహస్తిలో ఆమె పర్యటన కొనసాగనుంది.
Tags: Bhubaneswari in Naravaripalle