భువనేశ్వరీ యాత్ర.. రోజా కౌంటర్లు
తిరుపతి ముచ్చట్లు:
స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపం చెందిన వందలాది అభిమానులు, కార్యకర్తలు తుదిశ్వాస విడిచారని టీడీపీ అంటోంది … ఆ కుటుంబాలను పరామర్శించి, భరోసా కల్పించడానికి ‘నిజం గెలవాలి’ పేరిట బాబు సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు… అయితే భువనేశ్వరి యాత్రపై రోజా సెటైర్లు విసురుతున్నారు .. దాంతో పాటు టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం గురించి కూడా ఆమె మాట్లాడటంపై నెటిజన్లు మండిపడుతున్నారు.స్కిల్ స్కాం కేసులో జైల్లో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. బాబు అరెస్ట్ అయిన నాటి నుంచి ఎప్పుడు పొలిటికల్ స్క్రీన్ పై కనిపించని ఆయన భార్య భువనేశ్వరి జనంలోనే ఉంటూ వస్తున్నారు .. తాజాగా ‘నిజం గెలవాలి’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు .. ఇందులో భాగంగా మంగళవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు… కుప్పం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అయింది… అయితే.. భువనేశ్వరి యాత్రపై ఏపీ మంత్రి రోజా స్పందిస్తూ సెటైర్లు విసురుతున్నారు.. ఈ సందర్భంగా టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం గురించి కూడా రోజా ప్రస్తావన తెచ్చారు.నిజం గెలవాలంటూ నారా భువనేశ్వరి దేవుడికి గట్టిగా పూజలు చేశారు … అవును.. మేం కూడా నిజం గెలవాలనే కోరుకుంటున్నాం … నిజమే గనుక గెలిస్తే జీవితాంతం చంద్రబాబు జైల్లో ఉంటారు…. చంద్రబాబు జైల్లోనే శాశ్వతంగా ఉండాలని వెంకటేశ్వర స్వామికి భువనేశ్వరి పూజలు చేసినట్లు ఉన్నారు…. చంద్రబాబుతో పాటు లోకేష్, భువనేశ్వరీ కూడా జైల్లోనే వుంటారని రోజా వ్యాఖ్యానించారు…..
స్పాట్

నిజం గెలవాలని భువనేశ్వరికి మనస్పూర్తిగా ఉంటే సీబీఐ ఎంక్వయిరీ కోరితే నిజం ఖచ్చితంగా గెలుస్తుందని రోజా సెటైర్ విసిరారు … స్కిల్, ఐఆర్ఆర్ కేసులో భువనేశ్వరి సీబీఐ విచారణను కోరాలని రోజా చెప్పుకొచ్చారు… అదలా ఉంటే మరో మూడ్రోజుల పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భువనేశ్వరి బస్సు యాత్రం చేపడుతున్నారు … ఈ సందర్భంగా పలు బహిరంగ సభల్లో కూడా ఆమె ప్రసంగించనున్నారు… రోజా కామెంట్స్‌పై భువనేశ్వరి రియాక్ట్ అవుతారేమో చూడాలి. పనిలో పనిగా రోజా … పవన్, లోకేష్ లపై కూడా వ్యంగాస్త్రాలు విసిరారు .. ఆ ఇద్దరు కలిసి నిన్న పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారని … పాడుతా తీయగా కార్యక్రమం లాగా ఇటు ఆరుగురు.. అటు ఆరుగురు కూర్చుని సెలక్షన్స్ చేశారని ఎద్దేవా చేశారు.. అర సున్న.. అర సున్నా కూర్చుని జైల్లో ఉన్న గుండు సున్న కోసం పార్టీ దశ, దిశపై చర్చించామన్నడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు … వై ఏపీ నీడ్స్ పవన్, చంద్రబాబు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా..?. అలా వెళితే ప్రజలు వారి పళ్ళు రాళ్ళతో పగలకొడతారని చెప్పుకొచ్చారు.చంద్రబాబు జైల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని రోజా జోస్యం చెప్పడం విశేషం.. లోకేష్ యువగళానికి మంగళం పాడారని … ప్రస్తుత పరిస్థితుల్లో భువనేశ్వరి యాత్ర చేసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.. లోకేష్, పవన్ కళ్యాణ్ ని ప్రజలు ఛీకోట్టి ఓడించారని మంత్రి రోజా తన స్టైల్లో చెప్పుకొచ్చారు… ఆ క్రమంలో రోజా కామెంట్స్‌పై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి … సోషల్ మీడియా వేదికగా రోజాపై కౌంటర్ల వర్షం కురిపించడం మొదలు పెట్టారు.
Tags:Bhubaneswari Yatra.. Roja Counters
