Natyam ad

ఆత్మీయ సమావేశంలో పాల్గొ న్న భూమన అభినయ్

తిరుపతి ముచ్చట్లు:

అభినయ్ తిరుపతికి మంచి చేశాడా.. లేదా.. అని ఆలోచన చేయండి.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి  .స్థానిక SR కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.నగరంలో జరుగుతున్న అభివృద్ధిని గమనించండి.. తిరుపతి ఇప్పుడే అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంది.. దీనంతటికి కారణం నేను స్థానికుడిని కావడం, ఇక్కడే పుట్టిన వాడిగా నగరంలోని ప్రతి అంగుళం నాకు తెలుసు, అలాగే ప్రజలు పడుతున్న సమస్యలు కూడా నాకు తెలుసు.. చిన్నప్పటి నుంచి మీ సమస్యలు చూస్తూ పెరిగిన వాడిని, అందుకే ఎలా చేస్తే సమస్యల నుంచి బయటపడతారో నాకు పూర్తి అవగాహన ఉంది, డిప్యూటీ మేయర్ అయిన తొలి రోజు నుంచి అంచెలంచెలుగా సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నాను.

 

 

Post Midle

ఈ క్రమంలోనే 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించి ట్రాఫిక్ కష్టాలు తీర్చాను.గతంలో తిరుపతి అభివృద్ధి ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో మీరే బేరీజు వేసుకోండి, గత నాయకులు అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం స్వార్థపూరిత రాజకీయాలు మాత్రమే చేశారు, కానీ నేను మాత్రం నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాను.అందుకే రాబోయే ఎన్నికల్లో కులం ఆలోచనలు దాటి అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరుతున్నాను, అభినయ్ మంచి చేశాడు.. మా కోసం నిలబడుతున్నాడు అని మీరు నమ్మితేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా అడుగుతున్నాను.నేను గెలిస్తే వచ్చే ఐదు సంవత్సరాల్లో మెట్రో నగరాల స్థాయిలో తిరుపతి రూపురేఖలు పూర్తిగా మార్చేస్తాను అని మీబిడ్డగా మాట ఇస్తున్నాను.

Tags: Bhumana Abhinay who participated in the spiritual meeting

Post Midle