Natyam ad

టీటీడీ కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై భూమన ” కరుణ”

– బోర్డు తీర్మానాల ద్వారా టీటీడీ తీసుకున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి ప్రభుత్వ అనుమతి కోసం తీర్మానం

– ⁠ మాట నిలుపుకున్న కరుణన్న కు ఉద్యోగుల కృతఙ్ఞతలు

 

తిరుమల ముచ్చట్లు:

Post Midle

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జివో 114 ను టీటీడీ లో అమలు చేయడానికి ఎదురైన అడ్డంకులను తొలగిస్తూ టీటీడీ చైర్మన్  భూమన కరుణాకర రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జివో అమలులో ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ 2014 జూన్ 2వ తేదీకి ముందు టీటీడీ అవసరాల కోసం బోర్డు తీర్మానాల ద్వారా ( నోటిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా) చేరిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి అనుమతించాలని కోరుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం వల్ల వందలాది కుటుంబాలకు మేలు జరుగుతుంది. గత 15 నుండి 18 సంవత్సరాలుగా పని చేస్తున్న ఉద్యోగుల కల నెరవేర్చడానికి కరుణాకర రెడ్డి మార్గం సుగమం చేశారు.

 

గత మూడు బోర్డు సమావేశాల్లో చైర్మన్ కరుణాకర రెడ్డి ఈ ఉద్యోగులను ఆదుకోవడానికి అవకాశం ఉన్న మార్గాలన్నీ అన్వేషించి అధికారులతో అనేక విడతలుగా చర్చలు జరిపారు. ఈ ఉద్యోగుల ఇబ్బందులు, విన్నపాలను మనసుతో ఆలోచించి సోమవారం నాటి సమావేశంలో వారికి మేలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. మానవతా హృదయంతో వీరందరినీ పర్మినెంట్ చేయడానికి అనుమతించాలని ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదన పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు.చైర్మన్ కరుణాకర రెడ్డి నిర్ణయం పట్ల టీటీడీ లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా కోరిక తీరదేమో అనే ఆవేదనతో ఉన్న సమయంలో కరుణాకరరెడ్డి తమను ఆదుకుని న్యాయం చేశారని వారు కృతఙ్ఞతలు తెలియజేసారు.

 

Tags: Bhumana “Karuna” on TTD contract and outsourcing employees

Post Midle