మే 31న కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ
తిరుపతి ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కోసం మే 31వ తేదీ భూమి పూజ జరుగనుంది.బుధవారం ఉదయం 6.50 నుండి 7.20 గంటల మధ్య మిథున లగ్నంలో టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బా రెడ్డి వేద మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ నిర్వహించనున్నారు . తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు, టీటీడీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Tags: Bhumi Pooja for construction of Srivari temple in Karimnagar on 31st May

