Natyam ad

పుంగనూరులో 25న సబ్‌స్టేషన్‌కు భూమి పూజ

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలోని ఎంసి.పల్లె వద్ద 32 కెవి సబ్‌స్టేషన్‌కు బుధవారం ఉదయం భూమి పూజ చేయనున్నట్లు ట్రాన్స్కో ఏడి రవికుమార్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ట్రాన్స్కో ఎస్‌ఈ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే పిచ్చిగుండ్లపల్లె వద్ద ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తు ఫ్యాక్టరీకి కూడ భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారని, పనులు సకాలంలో పూర్తి చేస్తామని ఏడి రవికుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలన్నారు.

 

Tags: Bhumi Pooja for substation on 25th at Punganur

Post Midle
Post Midle