Natyam ad

నేషనల్ హైవే కి భూమి పూజ

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల జిల్లా హనుమంతరాయుని కొట్టాలలో 53కి.మీ  నేషనల్ హైవే-340బీకి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం భూమి పూజ చేసారు. రూ.630 కోట్ల అంచనాతో ఓర్వకల్ మండలం సోమయాజుల పల్లె నుంచి డోన్ వరకూ  జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. భూమి పూజకు ముందు హెచ్. కొట్టాల రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి  ప్రత్యేక పూజ నిర్వహించారు.నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జీలానీ సమూన్, బేతంచెర్ల మున్సిపల్ చైర్మన్ చలం రెడ్డి,ఎంపీపీ నాగభూషణం, జెడ్పీటీసీ శివలక్షమ్మ, ఎంపీటీసీ రత్నమ్మ, హెచ్.కొట్టాల సర్పంచ్ వెంకట లక్షమ్మ తదితరులు హజరయ్యారు.

 

Tags: Bhumi Pooja to National Highway

Post Midle
Post Midle