పుంగనూరులో సిలీండర్ల పరిశ్రమకు నేడు మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌చే భూమిపూజ
– రూ.60 కోట్లతో పరిశ్రమ
– 800 మందికి ఉద్యోగాలు
పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని ఆరడిగుంటలో గాయత్రి సిలీండర్ల పరిశ్రమ పనులకు ఆదివారం మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లచే భూమిపూజ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం పరిశ్రమ చైర్మన్ శ్రీనివాసులు, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ కలసి పరిశ్రమ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. వెంకటరెడ్డి యాదవ్ మాట్లాడుతూ మండలంలో సిలీండర్ల పరిశ్రమ ఏర్పాటుకు మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిల సహకారం మరువలేనిదన్నారు. గాయత్రి సిలీండర్ల పరిశ్రమకు 14 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. ఎంపీపీ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పడమటి మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిలు చర్యలు తీసుకోవడం శుభపరిణామమన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పైపుల పరిశ్రమకు కూడ భూమిని కేటాయించడం జరిగిందన్నారు. పుంగనూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ రూ.60 కోట్లతో సిలీండర్ల పరిశ్రమను మార్చిలోపు పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. 800 మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో మరింత మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, రెడ్డెప్ప, బాబు, ప్రశాంత్‌రెడ్డి , హరి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Tags: Bhumi Puja for cylinder industry in Punganur today by Minister Peddireddy and MP Midhun
