Natyam ad

చౌడేపల్లెలో ప్రహరీగోడ ఏర్పాటుకు భూమిపూజ

చౌడేపల్లె ముచ్చట్లు:


మండలకేంద్రంలోని దొరబావితోట సమీపంలో నూతనంగా నిర్మించిన సర్కిల్‌, పోలీస్‌ స్టేషన్‌ కార్యాలయాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి ఆదివారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సంధర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు రూ:10 లహొక్షల వ్యయంతో ప్రహరీ గోడ నిర్మాణపనులు చేపడుతున్నట్లు చెప్పారు. నాణ్యత ప్రమాణాలు పాటించి సకాలంలో పనులు పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ మునితుకారం, సీఐ మధుసూధనరెడ్డి, ఎస్‌ఐ రవికుమార్‌, ఎంపీపీ రామమూర్తి,సింగిల్‌విండో చైర్మన్‌ , రవిచంద్రారెడ్డి,సదుం కో ఆప్షన్‌మెంబరు ఇంమ్రాన్‌ మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ,సర్పంచ్‌ వరుణ్‌భరత్‌, ఎంపీటిసీ రూపారేఖ, మాజీ పాలకమండళి సభ్యుడు నాగరాజ, డిసీసీబి డైరక్టర్‌ రమేష్‌బాబు, ఎఫ్‌పిఎస్‌ మండలాధ్యక్షుడు వెంకటరమణ, పీఎంసీ కమిటీ చైర్మన్‌ శంకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ గోవిందు,రంగనాథ్‌, చంద్ర,గణేష్‌, ఆనందాచార్యులు,రమణ, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Bhumi Puja for the construction of a protective wall in Chaudepalle

Post Midle
Post Midle