ట్రెండ్స్ కు తగ్గట్టుగా సైకిల్స్..

Bicycle to Trends ..

Bicycle to Trends ..

Date:16/04/2018
విజయవాడ ముచ్చట్లు:
ఏపీలో మరో వారంలో సెలవులు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే మరి కొన్ని స్కూళ్లకు వేసవి సెలవులిచ్చేశారు.ఎంత ట్రెండ్‌ మారినా కొత్త కొత్త ఫ్యాషన్లలో వచ్చే సైకిళ్లను యువత కాలేజీలకు, ఫ్రెండ్స్‌తో షికారుకు వెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు. అప్పుడే అడుగులు నేర్చుకుంటున్న చిన్నారులు సైతం సైకిల్‌ కనిపిస్తే చాలు ఎంతో సంబరపడిపోతుంటారు. అందులోనూ వారికి ఉయ్యాలలో పడుకున్నంత హాయిగా సైకిళ్లు తయారు చేస్తుండటంతో చిన్న పిల్లలు ఇట్టే ఆకర్షితులవుతున్నారు పిల్లలు ఆటలాడేందుకు, అమ్మమ్మ, నాయనమ్మల ఇళ్లకు టూర్లకు వెళ్లేందుకు ఎన్నెన్నో ప్లాన్లు వేసుకుంటుంటారు. అటువంటి అవకాశాలు లేని వారు ఇళ్లల్లోనే స్నేహితులతోనో కొన్ని క్రీడా పరికరాలతోనో ఆటలాడుకుంటుంటారు. అలాంటి వాటిలో సైకిల్‌ ముఖ్యంగా చిన్నారులు ఇష్టపడతారు. సైకిల్‌ వాడేందుకు ఇష్టపడేవారిలో యువత మాత్రం తక్కువేం కాదు. . సైకిళ్లు ఒక సంవత్సరం వయసు పిల్లలకు కూడా ఉన్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు కదూ! ఒక సంవత్సరం నుండి 6 సంవత్సరాల పిల్లల వరకు సైకిల్స్‌ ఆట వస్తువులుగా ఉపయోగపడుతున్నాయి. 6 సంవత్సరాల తరువాత వయస్సు పిల్లలకు కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. అయితే వయస్సు ఆధారంగా వీటి సైజు ఉంటుంది. చిన్నపిల్లలకు ఉపయోగించే సైకిల్స్‌కు 4 చక్రాలు కూడా ఉంటాయి. వాటి ద్వారా అప్పుడే తన పుట్టిన బిడ్డ బుడి బుడి నడకలు వేస్తూ ఆ సైకిల్‌ ద్వారా నడక నేర్చుకుంటుంటే ఆ తల్లిదండ్రుల ఆనందం చేప్పలేనిది. ఇటువంటి ప్రేమానురాగాలకు సైకిల్స్‌ ఆట వస్తువులుగా ఉపయోగపడుతున్నాయి. దీంతో ముఖ్యంగా ఆటవస్తువులుగా ఉన్న సైకిల్స్‌కు మార్కెట్‌లో మంచి గిరాకీ ఏర్పడింది. పైగా ప్రజల అవసరాలకు అనుగుణంగా వీటి అమ్మకం చేసే దళారులు కూడా వీటిని అధిక ధరకు అమ్మకం చేసి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అసలు ఈ సైకిల్స్‌ అన్ని వయసుల వారికీ ఉంటాయి. వయసుతో పాటు సైజు కూడా ప్రామాణికం. 1 సంవత్సరం వయసు పిల్లలకు 4 చక్రాలు కలిగిన సైకిల్స్‌ అందుబాటులో ఉన్నాయి. అనంతరం 2 సంవత్స రాలు వయ సు కలిగిన పిల్లలకు కూడా నాలుగు చక్రాల సైకిల్స్‌ ఉన్నాయి. కాని సైజు కొలమానిత కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో పిల్లల నడక సులువుగా నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. 6 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు కూడా రకరకాల ఉపయోగాలతో సైకిల్స్‌ లభిస్తున్నాయి. దీంతో వీటి కొనుగోలుపై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారుమరి ముఖ్యంగా 10సంవత్సరాల లోపు చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో వీటి వాడకం అధికంగా ఉంది. వీటి అమ్మకం ధర వయస్సు, సైజు ఆధారంగా ఉంటుంది. 1 సంవత్సరం వయస్సు గల పిల్లలకు ప్రారంభం ధర 500 రూపాయల నుండి ప్రారంభం అవుతుంది. ఈ ధరలో నామమాత్రంగా మాత్రమే వీటి అమ్మకం ఉంటుంది. 500 రూపాయలపై బడిన సైకిల్స్‌ వల్ల రకరకాల ఉపయోగాలను ప్రజలకు కంపెనీలు ఎర వేస్తున్నాయి. 1 సంవత్సరం పిల్లలు వాడే సైకిల్స్‌ ప్రారంభం ధర 500 నుండి 1000 రూపాయల వరకు కూడా పలుకుతుంది. వీటిలో కూడా రకాలు ఉన్నాయి. వాటిని కొనుగోల ుదారులు ఎంచుకోవాల్సి ఉంది. 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు కూడా ప్రత్యేకంగా సైకిల్స్‌ ఉన్నాయి. సైజు మాత్రమే తేడా ఉంటాయి. ఇలా 5 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లల వరకు ఒకే రకమైనటువంటి సైకిల్స్‌ ఉన్నా, 6 నుండి 10 సంవత్సరాల వయసు గల పిల్లల వరకు ఒకే రకమైన సైకిల్స్‌ ఉన్నా, వాటి సైజుల్లో మాత్రం తేడాలుంటాయి. వీటి ధరలు 1000 రూపాయల పైమాటే. 1000 రూపాయల నుండి 1500 రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి. అనంతరం 11 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు ద్విచక్ర సైకిల్స్‌ అందుబాటులో ఉన్నాయి. దీంతో 11 సంవత్సరాల వయసు కలిగిన వారికి కూడా రకరకాల రకాలు అందుబాటులో లభిస్తు న్నాయి. ఎవరి అభిరుచి ద్వారా వారు ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. టీనేజర్స్‌ సైకిల్స్‌, అలాగే మధ్య వయసు గల వారికి సైకిల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ రకమైన సైకిల్స్‌ను 22 సంవత్సరాల వయసు కలిగిన వారు అధికంగా వాడుతున్నారు.వీటి అమ్మకం నేటి కాలంలో ఆన్‌లైన్‌లో అధికంగా జరుగుతుంది. మార్కెట్లో లభించే సైకిల్స్‌ను కొనేందుకు ప్రజలు ఆసిక్త చూపడం లేదు. ఆన్‌లైన్‌లో సైకిల్స్‌ అమ్మకం జోరు పెరిగింది.
Tags:Bicycle to Trends ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *