కొత్త అధ్యక్షుడిగా బైడన్ బాధ్యతలు

-కనీవినీ ఎరుగని భద్రతా

Date:19/01/2021

వాషింగ్టన్ ముచ్చట్లు:

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కోవిడ్-19 నిబంధనలు, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఈసారి ప్రమాణస్వీకార కార్యక్రమం ఇదివరకటి కన్నా భిన్నంగా ఉండబోతోంది.అమెరికాలో అధ్యక్ష ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని చేపట్టే కార్యక్రమాన్ని ‘ఇనాగ్యురేషన్’ అంటారు. వాషింగ్టన్ డీసీలో ఇది జరుగుతుంది.ఈ ప్రమాణ స్వీకారం పూర్తవ్వగానే బైడెన్ అధికారికంగా అమెరికాకు 46వ అధ్యక్షుడు అవుతారు. దీనితో ఇనాగ్యురేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత సంబరాలు మొదలవుతాయి.సాధారణంగా అధ్యక్ష పదవి కన్నా ముందే ఉపాధ్యక్ష పదవికి ప్రమాణస్వీకారం జరుగుతుంది.అమెరికా కొత్త అధ్యక్ష ఎన్నిక  చట్ట ప్రకారం జనవరి 20 నిర్వహించనున్నారు. స్థానిక కాలమానం ప్రకారం భారత్‌లో రాత్రి 10 గంటలకు ఈ కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం జరుగుతుంది. తర్వాత  జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేస్తారు.ఆ తర్వాత బైడెన్ వైట్ హౌజ్‌కు వెళ్తారు. తదుపరి నాలుగు ఏళ్లపాటు అదే ఆయన నివాసం, కార్యాలయం.అధ్యక్ష ప్రమాణస్వీకార కార్యక్రమాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయితే, ఇటీవల అమెరికా కాపిటల్ భవనంలోకి ట్రంప్ మద్దతుదారులు చొరబడిన నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత తీవ్రం చేస్తున్నారు.అధ్యక్ష ప్రమాణ స్వీకారం జరగనున్న నేపథ్యంలో అమెరికాలో, మరీ ముఖ్యంగా వాషింగ్టన్ డీసీలో సాయుధ నిరసనలు కూడా జరిగే అవకాశం ఉందని ఇటీవల ఎఫ్‌బీఐ హెచ్చరించింది. దీంతో అధికారులు భద్రతా చర్యలను పెంచడంపై దృష్టి పెట్టారు.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రిహార్సల్స్ ఆదివారం జరగాల్సి ఉన్నా, భద్రతాపరమైన ఆందోళనలతో వాయిదా వేశారని.

 

 

సోమవారం వీటిని నిర్వహించనున్నారుడెలవేర్‌లోని తన కార్యాలయం నుంచి సోమవారం బైడెన్, తన బృందంతో కలిసి గంటన్నర రైలు ప్రయాణం చేసి వాషింగ్టన్ రావాలనుకున్నారు. అయితే, భద్రతా కారణాల రీత్యా దీన్ని విరమించుకున్నారుఅధ్యక్షుడి భద్రత వ్యవహారాలు చూసుకునే సీక్రెట్ సర్వీస్ విభాగమే ఈ కార్యక్రమ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. నేషనల్ గార్డ్‌కు చెందిన 15 వేల మంది సిబ్బంది, వేల మంది పోలీసు అధికారుల సేవలను కూడా ఇందుకోసం వినియోగించుకుంటున్నారు.సంప్రదాయం ప్రకారం బహిరంగంగానే తాను ప్రమాణ స్వీకారం చేస్తానని బైడెన్ పట్టుపట్టారు. అయితే, ఈ సారి ఈ కార్యక్రమానికి తక్కువ సంఖ్యలోనే జనాన్ని అనుమతించనున్నారు.అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పదవి దిగిపోతున్న అధ్యక్షుడు రావడం సంప్రదాయం.అయితే, బైడెన్ ప్రమాణ స్వీకారానికి తాను వెళ్లనని ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించేశారు.అయితే, అంతకుముందే కొత్త ప్రభుత్వానికి ‘పద్ధతి ప్రకారం’ అధికార బదిలీ చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ట్రంప్ బహిరంగంగా ఇంతవరకూ తన ఓటమిని అంగీకరించారుఇక బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను వెళ్తానని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించారు.ఇప్పటివరకూ అమెరికా చరిత్రలో ముగ్గురు అధ్యక్షులు మాత్రమే తదుపరి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి రాకుండా ఉండిపోయారు.

 

 

 

అయితే, గత శతాబ్దంలో ఇలా ఎప్పుడూజరగలేదు.సాధారణంగా అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరయ్యేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో జనం వస్తుంటారు.2009లో ఒబామా మొదటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారు 20 లక్షల మంది హాజరయ్యారు.కానీ, ఈ సారి ‘చాలా పరిమిత సంఖ్య’లోనే జనాన్ని అనుమతించనున్నట్లు బైడెన్ బృందం తెలిపింది. ఇతర ప్రాంతాల నుంచి జనం ఇక్కడకు రావొద్దని విజ్ఞప్తి చేసింది.కాపిటల్ భవనం ముందు ఏర్పాటు చేసిన వేదికపై బైడెన్, హారిస్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. 1981లో రోనల్డ్ రీగన్‌తో మొదలు అందరు అధ్యక్షులూ ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.ఇక కాపిటల్ భవనం ముందున్న నేషనల్ మాల్ పార్క్‌లో వీక్షకుల కోసం ఇదివరకు ఏర్పాటు చేసిన స్టాండ్లను అధికారులు తొలగిస్తున్నారు.ఇదివరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రెండు లక్షల టికెట్లు అందుబాటులో ఉంచేవారు. అయితే, కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈసారి వెయ్యి టికెట్లు మాత్రమే పెట్టారు.అధికార బదిలీ సంప్రదాయంలో భాగంగా ‘పాస్ ఇన్ రివ్యూ’ కార్యక్రమం కూడా ఈ సారి జరగనుంది. ఈ కార్యక్రమంలో కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో కొత్త అధ్యక్షుడు సైన్యాన్ని పరిశీలిస్తారు.సాధారణంగా పెన్సిల్వేనియా అవెన్యూ నుంచి వైట్ హౌజ్ వరకూ ఈ కవాతు జరుగుతుంది.

 

 

 

అయితే, ఈసారి అమెరికా వ్యాప్తంగా ‘వర్చువల్ కవాతు’ ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. కొన్నేళ్లుగా ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో దేశంలోని ప్రముఖ గాయనీ గాయకుల ప్రదర్శనలు ఇవ్వడం పెరిగింది. ఈసారి కూడా అలాగే జరగనుంది.ప్రముఖ పాప్ స్టార్ లేడీ గాగా బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా అమెరికా జాతీయ గీతం పాడనున్నారు. ఆ తర్వాత సంగీత ప్రదర్శనలో మరో పాప్ స్టార్ జెన్నీఫర్ లోపెజ్ పాట పాడనున్నారు.బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాయంత్రం గంటన్నర పాటు ప్రత్యేక టీవీ కార్యక్రమం జరగనుంది. జాన్ బోన్ జోవి, డెమీ లొవాటో, జస్టిన్ టింబర్లేక్ లాంటి స్టార్లు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రముఖ నటుడు టామ్ హాంక్స్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇదివరకు ఈ సంబరాలు జనం ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాటు చేసేవారు.

 

 

 

ఒబామా మొదటి సారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బియాన్సే, అరెథా ఫ్రాంక్లిన్ ప్రదర్శనలు ఇచ్చారు. రెండో సారి కెల్లీ క్లార్క్సన్, జెన్నీఫర్ హుడ్సన్ ప్రదర్శనలు ఇవ్వగా… బియాన్సే జాతీయ గీతం పాడారు.ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాడే అవకాశాన్ని అప్పట్లో చాలా మంది పాప్ స్టార్లు తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి.మొదట్లో అమెరికా రాజ్యాంగంలో మార్చి 4ను అధ్యక్ష ప్రమాణ స్వీకార తేదీగా ఉండేది.నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఓట్ల లెక్కింపుకు సరిపడా సమయం ఉండాలని అప్పట్లో అలా పెట్టారు.అయితే, ఎన్నికల్లో ఆధునిక సాంకేతిక పద్ధతులు వచ్చాక ఫలితం తేలడానికి పట్టే సమయం తగ్గిపోయింది.దీంతో 1933లో రాజ్యాంగ సవరణ ద్వారా తేదీని జనవరి 20కి మార్చారు.

 

 

అడగడుగునా భద్రతకేపిటల్ భవనంపై జరిగిన దాడిలో కొందరు పోలీసులు కూడా పాల్గొనడంతో వైట్‌హౌస్ పరిసరాల్లో పూర్తిస్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 వేల మంది నేషనల్ గార్డులను వాషింగ్టన్‌లో మోహరించారు. అలాగే, వేలాదిమంది స్థానిక పోలీసులు విధుల్లో ఉన్నారు. అయితే, విపరీత భావజాలంతో వీరిలో ఎవరైనా దాడులకు దిగే అవకాశం ఉందన్న సమాచారంతో ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.అనుమానం వస్తే రెండు మూడుసార్లు తనిఖీ చేయాలన్న ఆదేశాలు కూడా అందాయి. ఒక్క వాషింగ్టన్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. చిన్నచిన్న గుంపులుగా వచ్చి ఆయుధాలు, పేలుడు పదార్థాలతో దాడి చేసే అవకాశం ఉండడంతో వారిని ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వేరీ తెలిపారు. మరోవైపు, దేశవ్యాప్తంగా ట్రంప్ మద్దతుదారుల ఆందోళన కొనసాగుతోంది.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags: Biden takes over as new president

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *