Natyam ad

 మంత్రి పెద్దిరెడ్డి తరపున బిఫాం అందజేత

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బిఫారాలను పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా లు ఆర్‌వోకు అందించారు. గురువారం బిఫాం పత్రాలను పార్టీతరపున ఆర్‌వో మదుసూదన్‌రెడ్డికి అందించారు. అలాగే మంత్రి పెద్దిరెడ్డి తరపున రెండు సెట్ల నామినేషన్లు, ఆయన సతీమణి స్వర్ణలత తరపున రెండుసెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, సున్ని అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఇనాయతుల్లా షరీఫ్‌, న్యాయవాదులు మధుసూదన్‌రెడ్డి, ప్రకాష్‌, సుధాకర్‌రెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.

Post Midle

 

Tags; Biform was presented on behalf of Minister Peddireddy

Post Midle