జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం

నెల్లూరు ముచ్చట్లు:


నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం వీరేపల్లి జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. లారీని తప్పించబోయిన కారు  కల్వర్టును ఢీ కొట్టి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడు మంది వ్యక్తులు వున్నారు. ఇద్దరు పరిస్థితి విషమం గా వుంది. ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో నలుగురు మహిళలు,ఇద్దరు చిన్నారులున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రాజమండ్రి వెళ్తుండగా ఘటన  చోటుచేసుకుంది. పోలీసులు క్షతగాత్రులను కావలి ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.

 

Tags: Big accident on national highway

Leave A Reply

Your email address will not be published.