మరో 2 వారాల్లో బిగ్ బాస్ 4

Date:22/07/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో పడింది. కరోనా ప్రభావంతో ఈ షో జరుగుతుందా? లేదా? అనే సందేహాల నడుమ ఎట్టకేలకు స్టార్ మా ప్రోమో వదిలింది. ఎప్పుడు? ఎక్కడ? హోస్ట్ ఎవరనే విషయాలను చెప్పకపోయినప్పటీ బిగ్ బాస్ సీజన్ 4 లేటుగా వచ్చినా రావడం మాత్రం పక్కా అంటూ ప్రోమో వదిలారు. దీంతో బిగ్ బాస్ సీజన్ 3 మరో రెండు వారాల్లో ప్రారంభం కావడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇంకా రెండు వారాలా అనుకుంటే కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు, కరోనా వ్యాప్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పకడ్భందీగా బిగ్ బాస్ షో నిర్వహణకు చర్యలు చేపడుతున్నారు. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ రెండు వారాలు ముందుగానే బిగ్ బాస్ హౌస్‌లో ఉండి.. ఆ తరువాత వారితో షో కంటిన్యూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు వారాలు వైద్యుల పర్యవేక్షలో ఉంచి ఆ తరువాత కరోనా నేపథ్యంలో హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకపోతే అప్పుడు వారిని కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట నిర్వాహకులు. ఇంతకీ బిగ్ బాస్ సీజన్ 4 వివరాల్లోకి వెళ్తే..

తెలుగులో మొదటిగా బిగ్ బాస్ 2017, 1 జూలై 16న ప్రారంభం కాగా.. సీజన్ 2 ఒకనెల ముందుగానే అంటూ జూన్ 10నే ప్రారంభమైంది. ఇక సీజన్ 3 మళ్లీ జూలై 21కి వెళ్లింది. అయితే సీజన్ 4 జూన్ నెలలోనే ప్రారంభించాలనే ప్రయత్నాలను కరోనా కట్టడి చేయడంతో మరింత ఆలస్యమైంది. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్న ఆసక్తి బుల్లితెర వర్గాల్లో మొదలైంది.ఈ తరుణంలో 15 మంది సెలబ్రిటీల లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇందులో ముగ్గురు హాట్ భామల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బాస్ ఫేమ్ ముంబై భామ పూనమ్ భజ్వా, ఐటమ్ భామలు హంసా నందిని, శ్రద్ధాదాస్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ లిస్ట్‌ ఎలా ఉందంటే..

1. పూనమ్ భజ్వా
2. శ్రద్దాదాస్
3. హంసా నందిని
4. సింగర్ సునీత
5. మంగ్లీ (సింగర్)
6. హీరో నందు (గీతా మాధురి భర్త)
7. వైవా హర్ష
8. అఖిల్ సార్దక్
9. యామినీ భాస్కర్
10. మహాతల్లి (యూట్యూబ్ సంచలనం)
11. అపూర్వ
12. పొట్టి నరేష్ (జబర్దస్త్ కమెడియన్)
13. మెహబూబా దిల్ సే (యూట్యూబ్ స్టార్)
14. ప్రియ వడ్లమాని
15. సింగర్ నోయల్

ఈ 15 మంది లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇందులో ఎంత మంది బిగ్ బాస్ హౌస్‌లో ఉంటారనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ 15 మంది మాత్రమే కాకుండా హీరో తరుణ్, తాగుబోతు రమేష్, వర్షిణి, విష్ణు ప్రియ ఇలా చాలా పేర్లు వినిపిస్తుండటంతో ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేవరకూ వేచిచూడాల్సింది. అయితే హీరో తరుణ్‌ తనకు బిగ్ బాస్‌కి వెళ్లే ఉద్దేశం లేదని.. రాదని కుండబద్దలు కొట్టేశారు. దయచేసి తప్పుడు వార్తలు రాయొద్దని రిక్వెస్ట్ చేశారు. ఈయనతో పాటు యాంకర్ ఝాన్సీ కూడా బిగ్ బాస్‌కి వెళ్లనని తేల్చి చెప్పింది. ఇక గత మూడు సీజన్ల కంటెస్టెంట్స్ విన్నర్స్ వివరాల్లోకి వెళ్లే..
బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ప్రారంభం 2017, 1 జూలై 16, హోస్ట్ ఎన్టీఆర్అర్చన, సమీర్, ముమైత్ ఖాన్, ప్రిన్స్, సింగర్ మధుప్రియ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, జ్యోతి, సింగర్ కల్పన, మహేష్ కత్తి, కత్తి కార్తీక, శివ బాలాజీ, ఆదర్శ్, హరి తేజ, ధనరాజ్, దీక్ష(వైల్డ్ కార్డ్), నవదీప్ (వైల్డ్ కార్డ్).. ఈ 16 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్నారు. వీరిలో ఫైనల్ కన్టెస్టెంట్స్‌గా ఆదర్శ్, శివబాలాజీ, హరితేజ, నవదీప్, అర్చనలు పోటీ పడగా.. శివబాలాజీ బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్‌గా నిలిచి రూ. 50 లక్షల ఫ్రైజ్ మనీ గెలుచుకున్నారు.

బిగ్ బాస్ రెండో సీజన్ ప్రారంభం 2018, జూన్ 10, హోస్ట్ నాని..
ఈ రెండో సీజన్ విషయానికి వస్తే.. 2018 జూన్‌ 10న నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభమైంది. ఈ సీజన్‌లో గీతా మాధురి, అమిత్ తివారీ, దీప్తి, తనీష్, బాబు గోగినేని, భాను శ్రీ, రోల్ రైడా, యాకర్ శ్యామల, కిరీటి, దీప్తి సునైనా, కౌశల్, తేజస్వి, గణేష్, సంజనా అన్నే, నూతన్ నాయుడు, నందినిలు కంటెస్టెంట్స్‌గా ఉండగా.. బుల్లి తెర నటుడు కౌశల్ బిగ్ బాస్ 2 విన్నర్‌గా అవతరించాడు.

బిగ్ బాస్ రెండో సీజన్ ప్రారంభం 2019, జూలై 21, హోస్ట్ నాగార్జున..
ఇక మూడో సీజన్.. 2019 జూలై 21న ప్రారంభంంకాగా.. యాంకర్ శివజ్యోతి, టీవీ నటుడు రవికృష్ణ, అశురెడ్డి, జర్నలిస్ట్ జాఫర్, నటి హిమజ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టీవీ నటి రోహిణి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, పునర్నవి భూపాలం, హేమ, అలీ రజా, మహేశ్ విట్ట, శ్రీముఖి, హీరో వరుణ్ సందేశ్.. ఆయన సతీమణి వితికా షెరు, యాంకర్ శిల్పా చక్రవర్తి (వైల్డ్ కార్డ్) కంటెస్టెంట్లు ఉన్నారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్‌గా అవతరించగా.. శ్రీముఖికి రన్నరప్ టైటిల్ దక్కింది.ఇక నాలుగో సీజన్ కంటెస్టెంట్స్ లిస్ట్‌లో పైన చెప్పిన 15 పేర్లు వినిపిస్తుండగా.. సీజన్ 3కి హోస్ట్ చేసిన నాగార్జునే నాలుగో సీజన్‌కి హోస్ట్ చేయనుండటం దాదాపు ఖాయమైంది. ఆగష్టు 16 నుంచి బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట

Tags:Bigg Boss 4 in another 2 weeks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *