బాల్య వివాహాలను అరికట్టాలి

Date:25/09/2020

-వార్డు కౌన్సిలర్ ఆడేపు కమల

జగిత్యాల ముచ్చట్లు:

బాల్య వివాహాలు ,బాలలపై శరీరక ,మానసిక వేధింపులను అరికట్టాలని 15 వార్డు కౌన్సిలర్ ఆడేపు కమల -మధు ఆన్నారు.
శుక్రవారం కోరుట్ల పట్టణంలోని 15 వార్డులో బాలల సంరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వార్డు కౌన్సిలర్ ఆడేపు కమల -మధు హజరై ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ బాలల సమస్యలను వివరిస్తూ వాటి నివరణకై కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా
బాల కార్మికుల నిర్ములన , భిక్షాటన, తదితర అంశాలు జరగకుండా చూడాలని తెలిపారు . బాలల హక్కులను కాపాడి వారికి చేయుతను ఇచ్చుటకు అందరూ కృషి చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో బాలరక్ష భవన్ కోఆర్డినేటర్ ప్రేమలత ,ఐసీడీఎస్ సూపర్వైజర్ సంపూర్ణ కుమారి,ఏఎన్ఎం బుజమ్మ , పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అందె శ్రీనివాస్, ఆంగన్ వాడి సిబ్బంది లక్ష్మీ, యూత్ సభ్యులు ఈసాక్ ,ఆఫ్సర్ ,సద్దాం తదితరులు పాల్గొన్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Tags:Bihar Assembly Election Schedule Released

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *