Natyam ad

మోహినీ అలంకారంలో అలరించిన బిహు, సోంగి ముఖోటా, డ్రమ్స్ నృత్యం

తిరుమల ముచ్చట్లు:

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం ఉదయం మోహినీ అలంకారంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన అపూర్వ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొత్తం 12 కళాబృందాల్లో 313 మంది కళాకారులు పాల్గొని ప్రదర్శనలిచ్చారు.బిహు అనేది అస్సాం రాష్ట్ర సాంప్రదాయ జానపద నృత్యం. ఇది సాధారణంగా వసంత రుతువును స్వాగతిస్తూ యువతీ యువకులు ప్రదర్శించే నృత్యం. 25 మంది కళాకారుల బృందం డప్పుల దరువులకు అనుగుణంగా లయబద్ధమైన అడుగులతో ఈ నృత్యాన్ని ప్రదర్శించారు. మహారాష్ట్రకు చెందిన జానపద నృత్యం సోంగి ముఖోటాను పూణేకి చెందిన రాజి బృందం ప్రదర్శించింది. 25 మంది సభ్యులు 25 కిలోల బరువున్న రంగురంగుల దుస్తులు ధరించి చక్కగా ప్రదర్శించారు.అదేవిధంగా, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల మోహినీ అవతార నృత్య ప్రదర్శన భక్తులను సమ్మోహనపరిచింది. రాజమండ్రికి చెందిన దుర్గా నాగమణి బృందం చేసిన డప్పు నృత్యం కనువిందు చేసింది. హైదరాబాదుకు చెందిన అభిరామి బృందం ఒడిస్సీ నృత్యంతో అలరించారు. తెలంగాణ రాష్ట్రం, వరంగల్ ప్రాంతానికి చెందిన రాహుల్ బృందం కావడి నృత్యాన్ని ప్రదర్శించారు. రాజమండ్రికి చెందిన పి.సుమన్ డ్రమ్స్ విన్యాసాలతో ముగ్ధులను చేశారు. కొత్తగూడెంకు చెందిన పి.వాసు బృందం కోలాటాలతో అలరించారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పి.రవితేజ బృందం గోపిక కృష్ణుడు వేషధారణతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. కర్నాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా, కంప్లికి చెందిన కె. కృష్ణ బృందం కొంబు కహాలే అనే జానపద కళారూపాన్ని ప్రదర్శించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. బెంగళూరు విద్యారణ్యపురికి చెందిన ఎస్.దివ్యశ్రీ సంకీర్తన కుసుమాంజలితో అలరించారు. తిరుమల బాలాజీ నగర్ కు చెందిన డి.శ్రీనివాసులు బృందం కోలాటాలతో అలరించారు.

Post Midle

టీటీడీ జెఈవో  సదా భార్గవి ఆదేశాల మేరకు ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారి  రాజగోపాల్‌, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి  ఆనంద తీర్థాచార్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

Tags:Bihu, Songi Mukhota, drums danced in Mohini adornment

Post Midle