జంగం కుల ధ్రువీకరణ పత్రంలో బిక్షాటన టాగ్ లైన్ తొలగించాలి :- సాటి గంగాధర్

చిత్తూరు ముచ్చట్లు:

జంగం కులస్తులకు జారీచేయు కుల ధ్రువీకరణ పత్రంలో బిక్షాటన అనే టాగ్ లైన్ ను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగం సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాటి గంగాధర్ కోరారు.జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు సుబ్రమణ్యం తో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ కు వినతి పత్రం సమర్పించారు.జంగం కులం వెనుకబడిన తరగతుల జాబితాలో ఏ గ్రూపులో వరుస నెంబర్ 9 లో ఉందన్నారు.కులదృవీకరణ పత్రలను కంప్యూటరీకరణ చేసిన తరువాత జంగం కులస్తులకు అతని/ఆమె సంప్రదాయ వృత్తి భిక్షాటన అనే టాగ్ లైన్ వస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు.ఇందువల్ల జంగమ కుల విద్యార్థిని, విద్యార్థులు తీవ్ర ఆత్మన్యూనతా భావానికి లోనవుతారనీ, సిగ్గుతో చితికి పోతున్నారని పేర్కొన్నారు.తోటి విద్యార్థులకు, అధికారులకు ధ్రువీకరణ పత్రం చూపాలంటేనే లజ్జగా ఉందన్నారు. ఈ కులంలో ఎందుకు పుట్టామా అనే తీవ్రమానసిక ఆవేదనకు గురవుతున్నారనీ, తోటి విద్యార్థులు మీరు అడుక్కుతినేవారా అని అవహేళన చేస్తున్నారని జిల్లా కలెక్టర్ కు వివరించారు.కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయునపుడు రెవెన్యూశాఖ అధికారుల నుంచి కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామనీ, మీరుబిక్షాటన చేయడం లేదు కదా ? సర్టిఫికెట్ఎలా ఇస్తాం అని కూడా ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

 

 

Post Midle

భారత రాజ్యాంగం బిక్షాటనను నిషేధించిందనీ, అయినా జంగం కుల ధ్రువీకరణ పత్రంలో ఆలా రావడం బాధాకరం అన్నారు.బిసి కులాల్లో అనేక కులాలు బిక్షాటన కులవృత్తిగా ఉన్నాయనీ, అయితే వీరిలో ఎవరికి కూడా కుల ధ్రువీకరణ పత్రాలలో అతని/ఆమె సంప్రదాయ వృత్తి భిక్షాటన అనే ట్యాగ్ లైన్ లేదని చెప్పారు.అధికారిక గెజిట్లో భిక్షాటన అనే పదాన్ని అలాగే ఉంచి, కులధ్రువీకరణ పత్రాలలో మాత్రమే తొలగించవలసింది గా కోరారు. ఈమార్పులు, చేర్పులు కారణంగా మేము బీసీ ఏ గ్రూపులో, అత్యంత వెనుకబడిన కులాల జాబితాలో కొనసాగడానికి ఇబ్బంది లేకుండా చూడాల్చిందిగా మనవి చేశారు.ఈ విషయమై జిల్లా కలెక్టర్ హరినారాయణన్ సానుకూలంగా స్పందించి సాంకేతిక సమస్యగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్యం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

 

Tags: Bikshatana tag line should be removed from Jangam caste certificate: – Sati Gangadhar

Post Midle
Natyam ad