Natyam ad

మూడురాజధానుల బిల్లు ప్రవేశపెట్టాలి

విశాఖపట్నం ముచ్చట్లు:

ప్రస్తుత అసెంబ్లీ సమావేశా ల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టి చట్టాన్ని తీసుకురావాలని సిపిఐ న్యూ డెమో క్రసీ డిమాండ్ చేస్తుంది. రాజధాని సమస్యను పాలక, ప్రతిపక్ష పార్టీలు రెండు తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ప్రజల మధ్య విద్వేషాలను సృష్టిస్తున్నారని సిపిఐ న్యూ డెమోక్రసీ విశాఖ, విజయనగరం ఏరియా కమిటీ సభ్యులు ఆరోపించా రు. ఇందులో భాగంగా జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద మూడు రాజధానులు బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ ఏరియా కమిటీ అధికార ప్రతినిధి కొండయ్య, పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ పాలకవర్గాలు ప్రజల మధ్య వైశమ్యా లను సృష్టించే విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కేంద్రంగా అభివృద్ధి, పరిపాలన అధికారాల వికేంద్రీకరణ జరగాలని, సమగ్ర సమతుల్య విధ్వంసరహిత, పర్యావరణహిత విధానాలను రూపొందించాలని కోరారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

 

Tags: Bill of three capitals should be introduced

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.