బందరు కృష్ణా విశ్వవిద్యాలయంలో 3వ  ‘జ్ఞానభేరి

Bindu Krishna University is the 3rd 'Jnanbhari

Bindu Krishna University is the 3rd 'Jnanbhari

 Date:14/09/2018
విజయవాడ ముచ్చట్లు:
కృష్ణా విశ్వవిద్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విశ్వవిద్యాలయం నూతన భవన సముదాయం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న కృష్ణా విశ్వవిద్యాలయం నూతన భవన సముదాయం ముఖ్యమంత్రి తేదీ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘జ్ఞానభేరి’ కార్యక్రమాన్ని కూడా మచిలీపట్నంలోనే నిర్వహించనున్నారు. ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నం జిల్లాలో జ్ఞానభేరి నిర్వహించిన ప్రభుత్వం మూడవ విడత జ్ఞానభేరి కార్యక్రమాన్ని మచిలీపట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.బందరు ఓడరేవు భూముల ప్రక్రియ కూడా కొలిక్కి వస్తుండగా ఓడరేవు నిర్మాణ పనులతో పాటు నిర్మాణాలు పూర్తి చేసుకున్న విశ్వవిద్యాలయం, ఉల్లిపాలెం-భవానీపురం వారధిని సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే పోర్టుకు భూములు ఇచ్చే రైతులకు పరిహారం చెల్లించే విషయంలో బ్యాంక్‌ల నుండి రుణం మంజూరుకు మరో నెల రోజులు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో తొలుత వర్సిటీ భవనాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభింప చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు చేసిన కృషి ఫలించింది. పోర్టు శంకుస్థాపన, ఉల్లిపాలెం-భవానీపురం వారధి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ నెలాఖరున నిర్వహించనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సుమారు నాలుగున్నర యేళ్ల తర్వాత తొలిసారిగా చంద్రబాబు మచిలీపట్నం వస్తున్నారు. దీంతో సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర అత్యతంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
Tgas:Bindu Krishna University is the 3rd ‘Jnanbhari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *