Natyam ad

మున్సిపల్ అధికారులకూ బయో మెట్రిక్  

నంద్యాల  ముచ్చట్లు:


ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ ఆధా రిత హాజరు విధానం (ఎస్ఆర్ఎస్) పట్టణ పురపాలక  సంస్థ పరిధిలో మంగళవారం నుంచి ప్రారంభ మైంది. శాశ్వత ఉద్యోగులందరికీ ప్రధాన కార్యా లయం వద్ద ప్రత్యేక యాప్ ద్వారా ఎస్ఆర్ఎస్ పాయింట్ ను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారులు, సచివాలయ ఉద్యోగులు సైతం మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మాత్రమే ఎస్ఆర్ఎస్ ద్వారా హాజరు వేయాల్సిన పరిస్థితి. క్షేత్రస్థాయిలో విధులకు హాజరై, ఆ తదుపరి ఉదయం 10.15 గంటలకు ప్రధాన కార్యాలయానికి వచ్చి ఎస్ఆర్ఎస్ వేయాలి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు క్షేత్ర స్థాయి విధులు నిర్వహించి అనంతరం సాయంత్రం 5.30 గంటల తర్వాత మరోసారి ప్రధాన కార్యాలయానికి రావాలి. దీంతో సంబం ధిత పీహెచ్ వర్కర్లు ప్రస్తుతం అనేక ఇబ్బం దులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

 

Tags; Biometric for Municipal Officers

Post Midle
Post Midle