తిరుపతి బరిలో  ఉభయపార్టీ అభ్యర్ది

Date:25/01/2021

అమరావతి  ముచ్చట్లు:

తిరుపతి ఎంపీ అభ్యర్ధి,  ఎపీలో  రాజకీయ పరిస్థితుల పై చర్చ జరిగిందని  బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు వెల్లడించారు.  ఆదివారం నాడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్   తో అయన భేటీ అయిన విషయం తెలిసిందే.  తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో అభ్యర్ధి పై చర్చించాం. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా .. ఉభయ పార్టీల పార్టీల అభ్యర్ధి  గా బరిలో దిగుతాం. బీజేపీ నా, జనసేన నుంచి అభ్యర్ధి పోటీలో  ఉంటారా అనేది మాకు ముఖ్యం కాదు. ఉభయపార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్దం చేశాం. 2024లో బీజేపీ, జనసేన లు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యం. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నాం. ఇరు పార్టీల ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా చర్చించామని అన్నారు. కుల, మత వర్గాల బేధాలు లేకుండా.. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తామని అయన వివరించారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌   త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tags: Bipartisan candidate in the Tirupati ring

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *