నిజామాబాద్ లో బర్డ్ ఫ్లూ

Date:13/01/2021

నిజామాబాద్ ముచ్చట్లు:

లంగాణలో బర్డ్ ఫ్లూ లేకపోయినా.. భయం మాత్రం ప్రజల్ని వెంటాడుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పక్షులు, కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నిజామాబాద్‌లో కోళ్ల మృతులు కలకలం రేపుతున్నాయి. డిచ్‌పల్లి మండలం యానంపల్లి తండా శివారులోని ఓ కోళ్ల ఫారంలో సుమారు 2 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. గత నాలుగైదు రోజుల నుంచి వరుసగా ఒకట్రెండు కోళ్లు మృతి చెందుతున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి చనిపోతూ వస్తున్నాయి.దీంతో వెంటనే కోళ్ల ఫారం యజమాని రామచంద్రగౌడ్ అప్రమత్తమై పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అధికారులు నాలుగైదు రోజుల క్రితం చనిపోయిన కోళ్ల కళేబరాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఆ రిజల్ట్ ఇంకా రాలేదు. అంతలోపే బుధవారం ఉదయం 2 వేల కోళ్లకు పైగా మృతి చెందడంతో.. స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మృతి చెందిన కోళ్లను సమీప అటవీ ప్రాంతంలో గుంత తీసి పూడ్చిపెడుతున్నారు. మరోవైపు తమ జిల్లాలో ఎక్కడ బర్డ్ ఫ్లూ వచ్చిందోనని భయపడి చాలామంది చికెన్ తినడం మానేస్తున్నారు.

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags:Bird flu in Nizamabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *