విమానాశ్రయం లో సీఎం ని కలిసిన బీరేంద్రవర్మ
-బీరేంద్ర ఎలా ఉన్నావ్..!
రేణిగుంట ముచ్చట్లు:

రాష్ట్ర స్థాయి విద్యాదీవెన కార్యక్రమం, రూ.5 కోట్లతో పునరుద్ధరించిన ప్రాంతీయ ఆస్పత్రి ప్రారంభం, రూ.26 కోట్ల అంచనాలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ముస్తాబైన నగరి పర్యటనలో భాగంగా సోమవారం తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, సత్యవేడు మండలానికి చెందిన మాజీ జెడ్పిటిసి, వైసీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి వైసిపి పరిశీలకుడు బీరేంద్రవర్మ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వర్మ ఎలా ఉన్నావు, పిల్లలు బాగున్నారా అని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Tags: Birendra Varma met the CM at the airport
