Natyam ad

ఘనంగా ఎంపీ అవినాష్ రెడ్డి జన్మదినం వేడుకలు

– బ్రెడ్లు, పండ్లు పంచిన ఎమ్మెల్యే డాక్టర్ సుధ

బద్వేలు ముచ్చట్లు:

Post Midle

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలను బద్వేల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస నాయుడు ఆధ్వర్యంలో  మున్సిపాలిటీలోని షాలేము అనాధ పిల్లల చారిటబుల్ ట్రస్ట్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ హాజరై అనాధ పిల్లలకు బ్రెడ్లు, పండ్లు, ఆమె చేతుల మీదుగా పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ అవినాష్ రెడ్డి మృదు స్వభావి, కార్యదీక్షపరుడు, పేదల పాలికి పెన్నిధి, నిండైన మంచితనం తో ప్రతిక్షణం ప్రజా సేవలో ఉంటూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గొప్ప వ్యక్తి ఎంపీ అవినాష్ రెడ్డి అని పేర్కొన్నారు.

 

 

 

అలాగే  కల్మషం లేని వ్యక్తిత్వంతో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైయస్ అవినాష్ రెడ్డిని అన్నారు. ప్రజా సంక్షేమమే దేంగా ప్రజా ప్రయోజనాల కోసం
నిరంతరం తాపత్రయపడే మహోన్నత వ్యక్తి ఎంపీ అవినాష్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన జన్మదిన వేడుకలను అనాధ పిల్లల మధ్యలో చేసుకోవడం ఎంతో ఆనంద దాయకంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సుందర్ రామిరెడ్డి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఈగ యద్ధారెడ్డి, నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు బంగారు సీనయ్య, శ్రీనివాస్ నాయుడు, మౌలాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Birthday celebrations of MP Avinash Reddy

Post Midle