అంగరంగ వైభవంగా NVR ట్రస్ట్ ఛైర్మన్ జన్మదిన వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:


ప్రముఖ పారిశ్రామికవేత్త, NVR ట్రస్ట్ వ్యవస్థాపకులు అయిన  యన్. వేణు గోపాల్ రెడ్డి   జన్మదినోత్సవ వేడుకలను ట్రస్ట్ సభ్యులు వైభవంగా నిర్వహించారు. తెలుగు తల్లి వృద్ధాశ్రమం నందు వృద్దులకు ఈ రోజు మూడు పూటలా భోజన సౌకర్యం తో పాటు వారికి దుస్తులు కూడా అందజేయడం జరిగింది. అంతే కాకుండా చధళ్ళ గ్రామం లోని చౌడేశ్వరి దేవి కళ్యాణ మండపం నందు మిత్రులు, శ్రేయోభలాషులు, ట్రస్ట్ సభ్యులు అధికంగా పాల్గొని వేణు గోపాల్ రెడ్డి కి జన్మ దినోత్సవ శుభకాంక్షలు తెలియజేశారు. ఈ కార్య క్రమం లో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివ కుమార్ రెడ్డి, సభ్యులు నరేంద్ర రెడ్డి,K.R చిన్నా,విరూపాక్ష,G.N. బాబు, జయ పాల్ రెడ్డి, శంకర్ రెడ్డి, వెంకట రమణ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, నాగరాజ రెడ్డి,సందీప్ రెడ్డి, జీవన్ రెడ్డి, కిషోర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Birthday celebrations of NVR Trust Chairman with grandeur

Leave A Reply

Your email address will not be published.