పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి , పుంగనూరు మండల ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భాస్కర్‌రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు ఆలయాలలో పూజలు చేసి, కేక్ కట్ చేసి , సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎంమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, వెఎస్సార్సీపీ మండల నాయకులు కొత్తొపల్లె చెంగారెడ్డి , రాజశేఖర్‌రెడ్డి నిర్వహించారు. అలాగే పట్టణంలో ముస్లిం మైనార్టీ నాయకులు అయూబ్‌ఖాన్, అమ్ము, వైఎస్సార్సీపీ కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, కౌన్సిలర్ నరసింహులు, ఎజాస్ఖాన్, నరేంద్రరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎంపీపీని సన్మానించారు. అలాగే మండలంలోని కొత్తపల్లెలో నేతలు శివకుమార్, సాయి,సోమశేఖర్ తదితరులు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అలాగే వర్థకవ్యాపారుల సంఘ అధ్యక్షుడు వెంకటాచలపతి, అమరావతి సురేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సన్మానించారు. ఉపాధ్యాయులు అయూబ్‌ఖాన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో, గ్రామాల్లో ప్లెక్సిలు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు , సన్నిహితులు , పార్టీ నాయకులు , ప్రజలు , భాస్కర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags: Birthday celebrations of Punganur MPP Akkisani Bhaskar Reddy
