Natyam ad

రుపాయికే బిర్యానీ

ఒంగోలు ముచ్చట్లు:


బిర్యానీ.. ఈ పేరు వింటే చాలు భోజన ప్రియుల నోట్లో నీళ్లూరుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ చికెన్ బిర్యానీ, కశ్మీరి బిర్యానీ అంటే తినడానికి సిద్ధమైపోతుంటారు. వారంలో కనీసం మూడు, నాలుగు రోజులైనా బిర్యానీ తినకుండా ఉండలేరు కొందరు. ఘుమఘుమలాడే బిర్యానీ దొరుకుతుందంటే ఎంత దూరం అయినా వెళ్తుంటారు. అందులోనూ ఆఫర్ ఉందంటే ఇక అక్కడే కూర్చొని కడుపునిండా తిని.. పార్సల్ కూడా పట్టుకొని వస్తుంటారు. ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. కేవలం ఒక్క రూపాయికే చికెన్ బిర్యానీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆ హోటల్ కు చేరుకున్నారు. కానీ రూపాయి నాణేలకు బదులుగా నోటు ఇస్తేనే…అని తెలియడంతో చాలా మంది వెనుదిరిగారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో కొత్తగా ఓ హోటల్ ప్రారంభించారు. అయితే మొదటి రోజు కావడంతో అదిరిపోయే ఆఫర్ ప్రకటించి భోజన ప్రియులను టెంప్ట్ చేశారు. ఒక్క రూపాయి నోట్ ఉంటే చాలు చికెన్ బిర్యానీ పార్శిల్ తీసుకెళ్లొచ్చని ప్రకటించారు. అంతే ఇక రూపాయి నోట్ ఇచ్చి బిర్యానీ తీసుకెళ్లేందుకు మాసం ప్రియులు ఉదయం నుంచే హోటల్ ముందే క్యూ కట్టారు. రూపాయికే బిర్యానీ ఇస్తున్న విషయం తెలుకున్న మరికొంత మంది నాణేలు పట్టుకొని రాగా.. నోటు ఇస్తేనే బిర్యానీ అని నిర్వాహకులు చెప్పారు. దీంతో పలువురు ఇళ్లకు వెళ్లిపోయారు. రూపాయి నోటు పట్టుకొని కూడా చాలా మందే హోటల్ కు రాగా… హోటల్ ఆవరణ ప్రాంతమంతా రద్దీగా మారింది.

 

 

 

ఇప్పటికే మూడు వందల మంది వరకు వచ్చారని.. ఇంకా మూడు వందల మంది వచ్చినా ఇబ్బంది లేకుండా చికన్ బిర్యానీ అందిస్తామని హోటల్ నిర్వాహకులు తెలిపారు. మీ దగ్గర కూడా నోట్ ఉంటే వెంటనే వెళ్లండి. రుచికరమైన బిర్యానీని రూపాయికే సొంతం చేసుకోండిబిర్యానీ పేరు చెబితేనే మన నోరూరుతుంది. బిర్యానీ నచ్చని భోజన ప్రియులు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి బిర్యానీని కేవలం ఐదంటే ఐదు పైసలకు అందిస్తే ఇంకేం ఎగబడి తింటారు. ఇలాగే ఓ హోటల్‌ ప్రారంభ ఆఫర్‌గా ప్రకటిస్తే జనాలు ఎగబడి తిన్నారు. ఆ ఆఫర్‌ కొన్ని షరతులతో విధించినా కూడా అనూహ్య స్పందన రావడంతో ఆ హోటల్‌ కిటకిటలాడింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ ఆఫర్ ఎక్కడ, ఇంత తక్కువ ధరకు ఎందుకిస్తున్నారు వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ వాచ్ దిస్ ఐదు పైసలకే బిర్యాని స్టోరీ..!చిత్తూరు జిల్లా పలమనేరులో మధు ఫ్యామిలీ డాబాను కొత్తగా ప్రారంభించారు.

 

 

 

Post Midle

ఈ ఫ్యామిలీ డాబా యాజమాన్యం 5 పైసలకే బిర్యానీ అందిస్తున్నట్లు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అది కూడా ఈ ఒక్కరోజు మాత్రమే అని చెప్పడంతో డాబాకు జనం క్యూ కట్టారు. దీంతో పాటు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ లో వచ్చిన కస్టమర్లకు 50% రాయితీ ఇస్తామని మరో ఆఫర్ కూడా ఇచ్చింది రెస్టారెంట్ యాజమాన్యం. ఇక ఇదే బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ తో.. మూడు రోజుల పాటు 25 శాతం రాయితీ అందిస్తున్నారు నిర్వాహకులు. దీంతో హోటల్ వద్ద ఐదు పైసల కాయిన్ తో క్యూ కడుతున్నారు నగర వాసులు. ఒక్కసారిగా చిన్నాపెద్దా అందరూ ఎగబడడంతో ఆ హోటల్‌ తాకిడిని తట్టుకోలేకపోయింది. అంత మంది తరలి రావడంతో యాజమాన్యానికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. వందలాది మంది తరలి రావడంతో ప్రస్తుతం రెస్టారెంట్ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.

 

Tags; Biryani for Rs

Post Midle