తెలుగోడి దెబ్బతో బీజేపీ అబ్బ

Date:15/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఏపీకి అన్యాయం అనే అంశం కుదిపివేస్తోంది. తెలుగు ఎంపీలు ఎక్కడా తగ్గకుండా సభను హోర్రెతించడంతో సభ ‘సజావుగా కొనసాగుతున్న పరిస్తితులు కనిపించడం లేదు. మార్చి నెల నుండి ఎప్పుడైనా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చు. కర్ణాటకలోని రాయచూరు, బెంగళూరు పరిసర ప్రాంతాలలో తెలుగువారి ప్రాభల్యం ఎక్కువ. బీజేపీకి మద్దతుదారులు ఎక్కువ. అయితే ఏపీకి వారు చేస్తున్న అన్యాయం అక్కడ వారిపై ప్రభావం చూపిస్తే ఘోరపరాభవం తప్పదు. దక్షిణాన బీజేపీకి పట్టు ఉన్న ఒకే రాష్ట్రం కర్ణాటక. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో అక్కడ ఎలాగైనా ఈసారి గెలవాలని పట్టుదలతో ఉంది కమలం పార్టీ.  దాదాపు 45 నుంచి 50 నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావితం చేయగలిగే అవకాశం ఉండడంతో  కమలంలో  కలవరం పుట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన రెండు లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ వెనుకబడి పోవడానికి కారణం తెలుగువారేనట. ముఖ్యంగా గొరఖ్ పూర్ నియోజకవర్గంలో ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లిన తెలుగుప్రజలు ఎక్కువగా ఉన్నారు.  బీజేపీ ఏపీకి అన్యాయం చేయడంతోనే అక్కడి తెలుగువారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే కర్ణాటకలో ఉన్న తెలుగువాళ్లు కూడా బీజేపీకి తప్పక బుద్ధి చెబుతారు. తెలుగు ప్రజల ఉసురు బీజేపీకి తగులుతుంది. ఇప్పటికైనా బీజేపీ వాస్తవాలను తెలుసుకుని ప్రజల సెంటిమెంట్ ను గౌరవించాల్సి ఉంది.యూపీ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు కావడం… ఏపీ దెబ్బ యూపీలో తగిలిందని, గోరఖ్ పూర్ లో అధిక సంఖ్యలో ఉన్న తెలుగు వాళ్లు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన తెలుగు వారు అధిక సంఖ్యలో గోరఖ్ పూర్ కు వలస వెళ్లిన ఉన్నారు.  ఏపీని బీజేపీ మోసం చేసిన ప్రభావం అక్కడ ప్రతిఫలించింది.  ఆ పార్టీకి తెలుగోడి ఉసురు తగులుతోంది. అలాగే త్వరలో ఎన్నికలు జరిగే కర్ణాటక రాష్ట్రంలోనూ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్నాయి.బీజేపీకి ఊహించని షాక్ తగిలింది.  27 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న గోరఖ్ పూర్‌ స్థానంలో… అదీ ఆదిత్యనాథ్‌ సీఎంగా ఉన్న సమయంలో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలవటాన్ని ఆ పార్టీ తట్టుకోలేకపోతోంది. గోరఖ్ పూర్ లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర దత్ శుక్లాపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్‌ కుమార్ నిషాద్‌ 21,881 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక మే నెలలో జరిగే కర్ణాటక రాష్ట ఎన్నికల్లో ఇదే రకమైన సెంటిమెంట్ దెబ్బ పడే అవకాశం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో కన్నడిగుల తరువాత తెలుగు ప్రాంతాల నుంచి వెళ్లి స్థిరపడినవారు ఎక్కువ. ఆంధ్రకు సరిహద్దు ప్రాంతాల్లోని కర్ణాటక నియోజక వర్గాల్లో తెలుగు ప్రాంత సెంటిమెంట్ ఎఫెక్ట్ పడనుంది. దాదాపు 46 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు బెంగళూరు నగరంలో చాలా ప్రాంతాల్లోని తెలుగువారి ఓటింగ్ ఎఫెక్ట్ బీజేపీకి తగలనుంది.
Tags: BJJ with the explanation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *