బానిసత్వన్ని ప్రోత్సహిస్తున్న బీజేపీ-అద్దంకి దయాకర్
వరంగల్ ముచ్చట్లు:
బానిస రాజకీయాలకు బీజేపీ తెర లేపిందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పులు మోశారు. తెలంగాణ సమాజాన్ని అమిత్ షా కించ పరిచారు. మునుగోడు ఆత్మగౌరవం చెబుతున్న బీజేపీ… తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీ, షా కాళ్ల వద్ద తాకట్టు పెట్టిందని ఆరో్పించారు. భారత రాజ్యాంగం సమానాత్వన్ని ప్రొత్సహిస్తుంతే… బీజేపీ బానిసత్వాన్ని ప్రొత్సహిస్తోంది. బీజేపీ మనువాదంతో… స్త్రీ సమానత్వాన్ని కోరదు. బీజేపీ విధానాల వల్లే మునుగోడు లో రాజగోపాల్ రెడ్డి తప్ప మరెవరు చేరలేదని అయన అన్నారు.
Tags: BJP-Addanki Dayakar promoting slavery

