ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు
నిర్మల్ ముచ్చట్లు:
బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాల పేరుతో ప్రజలతో ఆటలాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓహోటల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర కు వచ్చిన స్పందన చూసి ఓర్వలేకనే రాహుల్ గాంధీ రాజ్యసభ సభ్యత్వాన్ని బిజెపి రద్దు చేయించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద సంఖ్యలో నాయకులు ఉన్న పార్టీ అని, పార్టీ నుంచి ఎందరు వెళ్లిపోయిన పార్టీకి నష్టం జరగదని తెలిపారు. దేశంలో గాంధీ వారసత్వాన్ని చెరిపేసేందుకే బిజెపి కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెళ్లిపోవడంతో కిందిస్థాయి కార్యకర్తలు సంతోషంలో ఉన్నారని, రాబోయే వారం రోజుల్లో నియోజకవర్గంలో భారీగా చేరికలు ఉండబోతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఓటు విలువ 10 లక్షలు, 6వేలుగా మారిపోయిందన్నారు. ప్రజలతో ఆటలాడుకుంటున్న రాష్ట్రంలో ఉన్న కేడీకి, కేంద్రంలో ఉన్న మోడీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
Tags; BJP and BRS parties are polluting democracy

