బీజేపీ, వైసీపీ నేతలు రాష్ట్ర ద్రోహులు: ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

BJP and Vice-Leaders are state treacherous: MLC Buddha Vennka

BJP and Vice-Leaders are state treacherous: MLC Buddha Vennka

Date:15/08/2018
అమరావతి ముచ్చట్లు:
బీజేపీ, వైసీపీ నేతలు రాష్ట్ర ద్రోహులు అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మట్లాడుతూ . కన్నా నెత్తిన రూపాయి పెట్టినా… అర్ధ రూపాయికి కూడా కొనరని బుద్దా ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు లేదన్నారు.
నిన్న గంట వ్యవధిలోనే అమరావతి బాండ్ల రూపంలో… రూ. 2 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే చంద్రబాబు ఇమేజే కారణమని అన్నారు. 2014ఎన్నికల్లో చంద్రబాబు దయతో ఏపీలో బీజేపీ నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలిచిందని, 2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి మిగిలేది సున్నానే అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
Tags:BJP and Vice-Leaders are state treacherous: MLC Buddha Vennka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *