Natyam ad

జనసేన సభపై బీజేపీ ఆరా

న్యూఢిల్లీ,    ముచ్చట్లు:

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 14న భారీ ఎత్తున జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చి పవన్‌కు మద్దతు తెలిపారు. మచిలీపట్టణంలో నిర్వహించిన సభలో జనం ఊహించిన దాని కన్నా ఎక్కువగానే వచ్చారు. ప్రధానంగా జనసేన అదినేత పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి నిర్వహించిన రోడ్ షోకు మరింత క్రేజ్ వచ్చింది. రాజకీయంగా నిర్వహించిన రోడ్‌లో అభిమానులు, పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదే సందర్బంలో మహిళలు సైతం రోడ్ షోలో ఉత్సాహంగా పవన్‌ను చూసేందుకు వచ్చారు. దీంతో జనసేన వీరమహిళల్లో ఉత్సాహం కనిపించింది. విజయవాడ నుంచి మచిలీపట్టణం సభ వేదిక వరకు జనం పవన్ ను ఫాలో అవుతూనే ఉన్నారు. పవన్ నిర్వహించిన రోడ్ షో, మచిలీపట్టణంలో సభ ముగింపు వరకు అన్నింటిని పూర్తి వివరాలతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు వివరాలను తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులో ఉన్నవేళ పవన్ నిర్వహించిన కార్యక్రమం దాని పరిణామాలు, వచ్చిన వారిలో అభిమానులు, ఓటర్లు శాతం ఏంటి అనే వివరాలను కూడా నిఘా వర్గాల ద్వార భారతీయ జనతా పార్టీలోని పెద్దలు ఆరా తీసినట్లుగా చెబుతున్నారు..

 

Post Midle

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతలపై ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని పెద్దలతో సంప్రదింపులు జరిపి, కార్యక్రమాలను రూపొందిస్తే, రాష్ట్రంలోని నేతలు ముందుకు రావటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో భారతీయ జనతా పార్టీకి చెందిన నేతల్లో కూడా చర్చ జరిగింది. పవన్ ఇలా మాట్లాడటానికి గల కారణాలు ఏంటనే దానిపై పార్టీ నేతల్లో కూడా వివిద రూపాల్లో చర్చ జరుగుతుంది. ఈ పరిణామాలపై కూడా రాష్ట్ర నాయకత్వం నుంచి కేంద్రంలోని పెద్దలు వివరాలు అడిగారని అంటున్నారు..భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తు కొనసాగుతున్నప్పటికి, ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య సమన్వయం లేకపోయిందని స్వయంగా పవన్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏం చేయాలనే దానిపై క్లారిటి లేకుండా పోయిందన్నారు.

 

 

ఇప్పటంలో నిర్వహించిన 9వ ఆవిర్బావ సభలో కూడా పవన్ భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర నాయకత్వాన్ని రోడ్ మ్యాప్ ఇవ్వాలని బాహాటంగానే అడిగారు. అయినా ఆ పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. పవన్ నేరుగా విశాఖపట్టణం వేదిగా ప్రదానితో సమావేశం అయ్యారు. తర్వాత ఇప్పటి వరకు వరకు ఇరు పార్టీలకు చెందిన నాయకులు మధ్య సంప్రదింపులు జరిగినట్లుగా ఎక్కడా కనిపించిన దాఖాలు లేవు. వీటన్నింటికి మించి పార్టీకి రాజీనామా చేయకముందు కన్నా లక్ష్మినారాయణ కూడా పవన్‌ను బీజేపి సరిగ్గా వాడుకోవటం లేదని, అది రాష్ట్ర నాయకత్వం వైఫల్యమని కామెంట్‌ చేశారు. దీంతో పార్టీ నేతల్లో ఇప్పటికి అదే చర్చ జరుగుతుంది. పవన్‌ను సరైన రీతిలో వాడుకొని ఉంటే, ఇప్పటికే బీజేపి ఆంధ్రప్రదేశ్‌లో బలబడి ఉండేదని పార్టీ నేతల్లో అభిప్రాయం ఉన్నప్పటికి, రాష్ట్ర నాయకత్వంలోని మరి కొందరు నేతలు ఆ దిశగా అడుగులు పడకుండా, అడ్డుతగులుతున్నారా…అనే అనుమానాలు సైతం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

 

Tags;BJP asked about Janasena Sabha

Post Midle