రంభమైన ప్రజా గోస బీజేపీ భరోసా
ఆదిలాబాద్ ముచ్చట్లు:
ఆదిలాబాద్ నియోజకవర్గం జైనద్ మండల కేంద్రంలోని సూర్యనారాయణ స్వామి దివ్యక్షత్రం నుండి అభిమానుల కార్యకర్తల మధ్య ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఇందూర్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ సందర్బంగా మాట్లాడుతూ నరేంద్రమోదీ పాలనలో దేశం సుభిక్షంగా ఉంది, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో అన్ని వర్గాల ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారన్నారు. ఇటు రాష్ట్రం లో కేసీఆర్ మాత్రం తన నియంతృత్వ కుటుంబ పాలనతో రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నారన్నారు. పేదల ఆపన్న హస్తం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం పై ఇప్పటి వరకు కేంద్రం అక్షరాల 5000ల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆపత్ కాలంలో పేదలను అదుకుంటున్నారన్నారు.స్టాండ్ అప్ పథకం కింద ఆదివాసీ, యస్సీ, మహిళలకు 1400ల కోట్ల రూపాయల రుణాలు అందచారన్నారు. సర్వశిక్షా అభియాన్ పథకానికి విడుదలైన కోట్ల రూపాయలను కాళేశ్వరం ప్రాజెక్టుల మునగొట్టిండు, తన మనవడి తో సమానంగా పేదల పిల్లకు ఉన్నతమైన చదువులు చెప్పిస్తా అని వాళ్ళను వదలకుండా డబ్బులు కొట్టేసిండు అన్నారు.

ఒక ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత స్థాయి లో కూర్చోబెట్టన్న మహోన్నతమైన ఆలోచన కేవలం మన ప్రియతమ నాయకులు మాత్రమే చేయగలరని అన్నారు. దాన్ని కూడా వ్యతిరేకించిన మహాను భావుడు మన కేసీఆర్.జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులకు ప్రజలు రెండవసారి కూడా పట్టం కట్టింది ప్రజల ఈసారైనా బాగోగులు చూలుకుంటారని కానీ ఈ ఎమ్మెలే లు అక్రమంగా సంపాదించిన డబ్బుతో ప్రజలు ఎన్నుకున్న నాయకులను కొనుక్కుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారన్నారు. అధికార పార్టీ గోప్యంగా చేస్తున్న సర్వేలు అన్ని వారికి వ్యతిరేకంగా వస్తున్నాయి. జోగు రామన్న నీ ఖేల్ ఖతం డొందరలోనే కాబోతోంది, మీ పార్టీలోని ముఖ్యమైన నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ముహుర్తాలు పెట్టుకున్నారన్నారు.ఈ ర్యాలీలో జిల్లా ఇంచార్జ్ ఆల్జాపూర్ శ్రీనివాస్, మండలాధ్యక్షులు కట్కం రాందాస్, రదొడ్ రమేష్ . లాలా మున్న. జోగు రవి. ప్రవీణ్ రెడ్డి. జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags: BJP assures massive public outcry
