బెజవాడలో బీజేపీ బైక్స్

Date:15/02/2018
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ లో 80 శాతం వోట్ బ్యాంకు సంపాదించటానికి ఉత్తర్ ప్రదేశ్ నుంచి బైకులు వచ్చాయి… ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదగకపోవటానికి కారణమేమిటో అమిత్ షా, మోడీకి తెలిసిపోయింది.. అందుకే యూపీలో బ్రహ్మాండమైన ఘనవిజయానికి కారణమైన బైకులను బెజవాడ తెప్పించారు… ఇక ఈ బైకులు వేసుకుని, ఊరు ఊరు తిరిగి, 2019 ఎన్నికల్లో బీజేపీ అబ్యార్ది సియం అవ్వటమే మిగిలింది…యూపీ నుంచి యూపీ రిజిస్ట్రేషన్‌తోనే బైకులు బెజవాడ వచ్చయి.. దాదాపు ఒక 100 బైకులు తెప్పించారు… బైకులు కూడా అక్కడ నుంచి తెప్పించాలా అని అడిగితే, వీటితో అక్కడ పని లేదు, అక్కడ ముఖ్యమంత్రి మా వాడే, ఇక్కడ మేము ముఖ్యమంత్రి అవ్వాలి కాబట్టి, ఈ బళ్ళు తెప్పించాం… ఈ బైకుల మీద తిరిగి, ఆంధ్రప్రదేశ్ మారు మూల ప్రాంతాలకు తిరిగి చంద్రబాబుని ఎండగట్టి, మా అభ్యర్ధి ముఖ్యమంత్రి అవుతారు అని తేల్చేసారు రాష్ట్ర బీజేపీ నేతలు… అందుకే ఇవి యూపీ రిజిస్ట్రేషన్ బైకులు కాబట్టి, మళ్ళీ చంద్రబాబు టెక్నాలజీ ఉపయోగించి, అవి ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు అని ఎక్కడ లోపల వేస్తాడో అని, ముందుగానే బెజవాడలో రీ రిజిస్ట్రేషన్ చేపించారు…ఇక టైం చూసుకుని ఒక కొబ్బరికాయ కొట్టి,ప్రారంభించనున్నారు.కేంద్రం రాష్ట్రానికి చేసిన లక్షల కోట్ల సహాయం గురించి, ఈ బైక్ లు మీద చెప్తారు, వినటానికి రెడీ అవ్వండి..
Tags: BJP bikes in Bezawada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *