బీజేపీ నెక్స్ట్ర్ ఏంటీ 

Date:25/05/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కేంద్రంలో బ్రహ్మాండమైన మెజారిటీ సాధించిన కమల నాథుల తదుపరి లక్ష్యం ఏంటి? బొటా బొటీ మెజారిటీతో కుప్ప కూలడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్రాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోడమేనా? బెంగాల్ లో మమత కోటకు బీటలు పెట్టిన బీజేపీ తన దృష్టిని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైకి మళ్లించిందా? ఎన్డీఏ కూటమి కేంద్రంలో తిరుగులేని ఆవిర్భావ శక్తిగా ఎదిగిన బీజేపీ ఇప్పుడు గెలుపు ఉత్సాహంలో ఉంది.. ఈ గెలుపును మలుపుగా చేసుకుని రాష్ట్రాలలో పార్టీ విస్తరణకు బీజేపీ దూకుడు ప్రయత్నాలు మొదలు పెట్టేస్తోందా? రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న సంకీర్ణ సర్కార్ లను పార్టీలను ఓ పట్టు పడతారా అంటే అవుననే అనుమానాలే ఎక్కువవుతున్నాయి. కాంగ్రెస్ బొటా బొటీ మెజారిటీతో కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ తనదైన శైలిలో చక్రం తిప్పుతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. కర్ణాటకలో ఇప్పటికే అధికారం దక్కించుకోడానికి అనువుగా ఎత్తుగడలు వేస్తోంది. కాంగ్రస్, జేడీఎస్ మధ్య సంబంధాలు దెబ్బతినడం, కాంగ్రెస్ నేత డీ.కే. శివకుమార్ బీజేపీతో టచ్ లో ఉండటం వల్ల ఏ క్షణాన్నైనా కర్ణాటక సర్కార్ లో ముసలం పుట్టొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

 

 

 

 

 

 

ఇక మధ్య ప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉందని బీజేపీ గెలిచిన మరుక్షణమే సంకేతాలు వెలువడ్డాయి. కమల్ నాథ్ సర్కార్ మైనారిటీలో ఉందని పదవినుంచి తప్పుకోవాలంటూ బీజేపీ గవర్నర్ దగ్గర పంచాయతీకి తెర లేపింది.ఉత్తరాదిన మంచి పట్టు సంపాదించిన బీజేపీ ఇప్పుడు తన చూపు దక్షిణాదివైపుకు మరలుస్తోంది. ఏపీలో బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతామని, తెలంగాణలో ప్రజాస్వామ్య పోరాటాలు చేసి నిలదొక్కుకుంటామనీ, భవిష్యత్తులో అధికారంలోకి వస్తామనీ బీజేపీ పెద్దలు చెబుతున్నారు. దీనిని బట్టి కమల నాథులు తెలుగు రాష్ట్రాలపై కన్నేసినట్లు కనిపిస్తోంది. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బీజేపీ మళ్లీ ఏపీ వైపు చూస్తోంది. జగన్ తో సత్సంబంధాలు నెరపుకుంటూ పార్టీ పటిష్టతకు బీజం వేసుకునే ఉద్దేశంతో ఉంది. ఇక బెంగాల్ లో ఊహించని విధంగా బీజేపీ పుంజుకుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

రెండు సీట్ల నుంచి ఏకంగా 18 ఎంపీ సీట్లకు ఎగబాకడం నిజంగా చరిత్రాత్మకం మమతా బెనర్జీ పట్టు నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి బీజేపీ అక్కడ పునాదులు నిర్మించుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో మోడీ 42 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ చేసిన బెదిరింపు వెనక పైకి కనపడని ప్రయత్నాలేవో జరుగుతున్నాయని తెలుస్తోంది.ఎన్నికల ఫలితాలు రాగానే ఇద్దరు తృణమూల్ ఎంపీలు కూడా బీజేపీ నేతలతో టచ్ లోకి రావడంతో బెంగాల్ లో బీజేపీ కుదురుకోడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేసినట్లే అర్ధమవుతోంది.

 

 

ప్రక్షాళనలు వుంటాయి

Tags: BJP Chief Executive Officer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *