చెత్త పన్నుపై బీజేపీ అందోళన

విశాఖపట్నం   ముచ్చట్లు:
కరోనా కష్ట కాలంలో ఆస్తి పన్ను పెంచడం, చెత్త పన్ను విధించడం దారుణమని బీజేపీ నేతలు మండి పడ్డారు. విశాఖ జీవీఎంసీ కార్యాల యం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కమలనాథులు నిరసన తెలియ జేసారు.ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ కరోనా కాలంలో పన్నుల పెంపు ఏమిటి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పన్నులు పెంచుతుంటే ప్రజలు ఓట్లతో గెలిసిన ఎమ్మెల్యే లు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పన్ను ల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకో వాలని డిమాండ్ చేశారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:BJP concern over worst tax

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *