బీజేపీ కుట్ర చేస్తోంది : సీఎం చంద్రబాబు

Date:15/03/2018
అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ లో తమిళనాడు తరహా రాజకీయాలకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి విభజన ప్రత్యేక హోదా, విభజన హామీల ఊసు ఎత్తకుండా ద్రోహం చేసిన బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో విభజన రాజకీయాలకు తెరతీసిందని ఆయన విమర్శించారు. గురువారం నాడు పార్టీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన బీజేపీ కుట్రలను భగ్నం చేద్దామని పిలుపు నిచ్చారు. పార్లమెంటులో ఆందోళన కొనసాగించాలని ఎంపీలను ఆదేశించారు.  తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని మహాకుట్ర జరుగుతోందన్న చంద్రబాబు ఈ పథక రచనలో చాలామంది పెద్దలు ఉన్నారని ఆరోపించారు. స్థానికంగా ఈ కుట్రలో కొందరు భాగస్వాములు వున్నారు. ఈ కుట్రలో భాగస్వాములు అందరినీ ప్రజలు తిరస్కరిస్తారు. ఎన్నో కుట్రలను తెలుగుదేశం పార్టీ సమర్ధంగా ఎదుర్కొంది. ప్రత్యర్ధుల కుట్రలను ప్రజలే తిరస్కరిస్తారని అయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలే రక్షకభటులు. పార్టీని,రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకుంటారు. లాలూచీ రాజకీయాలను ప్రజలు సహించరని అయన అన్నారు. తెలుగుదేశం పార్టీపై కుట్రలను ప్రజలే తిప్పికొడతారని అయన అన్నారు. 5కోట్లమంది మన హక్కుల కోసం ముక్తకంఠంతో పోరాడాల్సిన సమయం ఇది. ఏవైనా విమర్శలుంటే ఎన్నికలప్పుడు చేయాలి,ఇప్పడు కాదు. న లక్ష్యాన్ని మనవాళ్లే దెబ్బతీయడం బాధాకరమని అయన వ్యాఖ్యానించారు. బాధ్యత గల వ్యక్తిగా రాష్ట్రం హక్కుల కోసం పోరాడాలి. అంతేతప్ప ముఖ్యమంత్రిని బలహీన పరచడం తగదు. పవన్ కళ్యాణ్ పై ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయవద్దని అన్నారు. మన విమర్శలు హుందాగానే ఉండాలని అయన అన్నారు. ఎవరు నన్ను తిట్టినా,తిట్టించినా అవి నాకు ఆశీర్వాదాలే. ఎవరూ ఆవేశకావేశాలకు లోనుకారాదని సూచించారు. ఇది కీలక సమయం,మన లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉండాలని అన్నారు.
Tags: BJP conspiracy is doing: CM Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *