బీజేపీ ధర్నా
కాకినాడ ముచ్చట్లు:
దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చాలని గత అసెంబ్లీ సమావేశాలలో అధికార పార్టీ చేసిన తీర్మానాన్ని నిరసిస్తూ., వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజేపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద బిజేపి నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ మోర్చా నాయకులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ నాయకులు యోనిమిరెడ్డి మాలకొండయ్య, ముత్తా నవీన్ లు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags;BJP dharna
