Natyam ad

ఏపీ పాలిటిక్స్ పై  బీజేపీ డైరక్షన్

న్యూఢిల్లీ ముచ్చట్లు:


ఆంధ్రప్రదేశ్ బీజేపీ పొత్తులపై తేల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అలా పార్టీలో చేరగానే ఇలా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ పార్టీ హైకమాండ్ పెద్దలతో చర్చలు జరిపి వెళ్లిన రెండు రోజుల్లోనే కీలక సమావేశాలు ప్రారంభమయ్యాయి. పొత్తుల విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా వచ్చే ఎన్నికల కోసం ఓ రోడ్ మ్యాప్‌ను ఖరారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే హైకమాండ్ ఓ క్లారిటీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుందని చెబుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును బీజేపీ హైకమాండ్ ఢిల్లీకి పిలిచింది. పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు.  మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళ్లలేదు.  ఇప్పుడు ప్రత్యేకంగా పిలవడంపై మాత్రం బీజేపీలోనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో  కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ పాత్ర ఎలా ఉంటుందన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కరిణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసినందున జాతీయ రాజకీయాలకే ఉపయోగించుకుంటారని..

 

 

రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్ర తక్కువ ఉండవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.  జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఢిల్లీ వెళ్లారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు.ఏ చర్చలు జరిపారన్నదానిపై స్పష్టత లేదు కానీ..పొత్తుల గురించి కూడా మాట్లాడామని తర్వాత అమరావతిలో మీడియా సమావేశం పెట్టినప్పుడు నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఏపీలో వైసీని ఓడించడమే లక్ష్యమని పవన్ ఢిల్లీలోనే ప్రకటించారు. తాము టీడీపీతో కలిసి వెళ్లడం ఖాయమని ఏపీలో రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉందికాబట్టి  బీజేపీ కూడా కలసి వస్తే బెటరని జనసేన నుంచి బీజేపీకి సందేశాలు వెళ్లాయని చెబుతున్నారు. అది ఎంత వరకు నిజమో కానీ..  బీజేపీలో ఉన్న కొంత మంది టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.  సోము వీర్రాజు పర్యటనలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఏమిటో అన్నది క్లారిటీకి వచ్చే అవకాశంఉంది. జనసేనకు క్లారిటీ ఇస్తే.. ఆ పార్టీ తన రాజకీయ వ్యూహాలను తాను అమలు చేసుకునే ్వకాశం ఉంది.

 

 

 

Post Midle

ఒంటరిగా పోటీ చేస్తే  బీజేపీకి నిరాశే ఎదురవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఢిల్లీ స్థాయిలో మంచి సంబంధాలు ఉన్న వైఎస్ఆర్‌సీపీ నేరుగా బీజేపీతో పొత్తులు పెట్టుకోలేదు. అది అసలు సాధ్యం కాదన్న వాదన ఉంది. రెండు వైపులా పార్టీలకు అభ్యంతరాలు ఉంటాయి. జగన్ పై ఉన్న కేసుల కారణంగా బీజేపీ పొత్తులకు సిద్ధపడకపోవచ్చు.. ఒకవేళ బీజేపీ ఓకే అన్నా…  వైసీపీ కోర్ ఓట్ బ్యాంక్..  బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది. పొత్తులు పెట్టుకుంటే దూరమవుతారు. అది  చాలా నష్టం చేస్తుంది. అందుకే .. వైసీపీలో పొత్తు సాధ్యం కాదు. జనసేన పార్టీ ఒక్క బీజే్పీతోనే నడిస్తే ఏం ప్రయోజనం ఉండదని అనుకుంటోంది.   టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు అటు అెసంబ్లీలో ఇటు మండలిలో రెండు చోట్లా బీజేపీ ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు పొత్తు లేకపోతే..  అలాంటిదేమీ ఉండదు. ఇప్పటికిప్పుడు పొత్తులపై నిర్ణయం తీసుకోకపోయినా ఓ క్లారిటీ సోము వీర్రాజుకు హైకమాండ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

 

Tags: BJP Direction on AP Politics

Post Midle